ఘనంగ స్మార్ట్ సిటీ రిపోర్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఉగాది వేడుకలు.
నిజమైన ప్రజా సేవకులు జర్నలిస్టులే
- సేవల లో జర్నలిస్టులే బెస్ట్ - సమాజానికి అద్దం జర్నలిస్టులు .
- మిలీనియం సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ సీఈవో శ్రీ జి శ్రీధర్ రెడ్డి
విశాఖపట్నం,
సమాజానికి నిలువెత్తు అద్దం జర్నలిస్టులేనని పలువురు వక్తలు పేర్కొన్నారు. మంగళవారం ఉదయం నుండి సాయంత్రం వరకు సింధూర ఫంక్షన్ హాల్ లో స్మార్ట్ సిటీ రిపోర్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉగాది సంబరాలు జరిగాయి. మిలీనియం సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ సీఈవో శ్రీ జి శ్రీధర్ రెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొని స్మార్ట్ సిటీ రిపోర్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ చేస్తున్న సేవలను అభినందించారు. ముందుగా శ్రీ పిళ్లా శర్మ పంచాంగ పఠణంతో ఉగాది సంబరాల కార్యక్రమం ప్రారంభమైంది. ఆహూతులైన అతిధులకూ సభ్యులకూ ఆయన పండిత ఆశీర్వాదం అందజేశారు. ఈటీవీ ఫేమ్ శ్రీ ఎమ్మెస్సార్ నాయుడు సీనియర్ జర్నలిస్టు పద్మజ వ్యాఖ్యాతలుగా వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో భాగంగా మధురవాడ జాతర ప్రాంతంలోని ప్రముఖ నాట్యాచార్యులు శ్రీ మురళి గోవింద్ నిర్దేశకత్వంలో చిన్నారులు శాస్త్రీయ జానపద నృత్య రీతులను ప్రదర్శించారు. జర్నలిస్ట్ లీలా ప్రసాద్ మిమిక్రీ తో, దేవీ ప్రసాద్ జానపద గీతాలతో అలరించారు. కార్యక్రమంలో భాగంగా జర్నలిస్టులు శ్రీమతులు పద్మజ, ప్రసన్న, శిరీష, మాణిక్యాంబ., రోజ., సంధ్య., వెంకటలక్ష్మి, జ్యోతి లతో పాటు శ్రీయుతులు ఎంవీఎస్ అప్పారావు, ఆదినారాయణ, సూరిబాబు, రంగధామ్., ఈశ్వరరావు, ఎ చంద్రశేఖర్, బాలు పాత్రో., ఎస్ఎస్ నాయుడు., ఎంపీఎ రాజు., ఎం లక్మణ యాదవ్., జోగ శ్రీనివాసరావు., రిషికేష్., ఎల్లాజీరావు., ఎన్ అశోక్ రెడ్డి., లీలా ప్రసాద్., మోహనరావు., లకు ఉగాది పురస్కారాలను ఇచ్చి గౌరవించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభా వేదికపై ముఖ్యఅతిథిగా పాల్గొన్న మిలీనియం సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ సీఈవో శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ బంగారు అశోక్ కుమార్ ఆధ్వర్యంలో జర్నలిస్టులకు భేషైన సేవా కార్యక్రమాలు జరుగుతున్నాయని అభినందించారు. జర్నలిస్టుల సంక్షేమం పట్ల చిత్తశుద్ధితో అశోక్ ఆధ్వర్యంలోని బృందం విశేషంగా కృషి చేస్తుందని అభినందించారు. హుదూద్ కాలంలోనూ కరోనా కష్ట పరిస్థితుల్లోనూ స్మార్ట్ సిటీ రిపోర్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులకు అండగా నిలిచిన తీరు ఆదర్శంగా ఉందని శ్రీధర్ రెడ్డి భావించారు. రాజ్యసభ సభ్యులు విజయసాయి రెడ్డి గారు తరపున తాను ఈ కార్యక్రమంలో పాల్గొన్నట్లుగా ఆయన వెళ్లడించారు. సమాజసేవలో అహర్నిశలు కృషి చేస్తుండే జర్నలిస్టులకు ఎప్పుడూ అండగా ఉండాలనే విజయసాయి రెడ్డి గారి ఆదేశాలను తప్పకుండా పాటిస్తామన్నారు. అన్ని వేళల జర్నలిస్టులు వారి కుటుంబ సభ్యులకు అండగా ఉంటామని ఈసందర్భంగా మిలీనియం సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ సీఈవో శ్రీధర్ రెడ్డి ప్రకటించారు. జీవీఎంసీ మాజీ డిప్యూటీ మేయర్., రంగస్థలం సంస్థల కళాకారుల ప్రోత్సాహకులు శ్రీ దాడి సత్యనారాయణ గౌరవ అతిథి ప్రసంగం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జర్నలిస్టుల సహకారంతోనే సమాజంలో పలువురు గుర్తింపును గౌరవాన్ని జనాదరణనూ పొందుతున్నారని పేర్కొన్నారు. అందులో తాను ఉన్నానని చెబుతూ జర్నలిస్టులతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. అన్ని వేళలా జర్నలిస్టుల వారి కుటుంబ సభ్యులకు కళాకారులకు ఎలాంటి సేవలు అందించేందుకు అయినా తాను సిద్ధంగా ఉంటానని ఆయన వెల్లడించారు. ఇదే వేదికపై సీనియర్ జర్నలిస్టులు శ్రీ నాగన బోయిన నాగేశ్వరరావు ,శ్రీ అప్పారావు పాత్రుడు., శ్రీ కే చంద్రమోహన్ మాట్లాడుతూ జర్నలిస్టులకు అండగా నిలుస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేశారు. జర్నలిస్టులు పూర్తిస్థాయిలో తమ సమయాన్ని సమాజానికి ఉపయోగపడే సేవలులో నిమగ్నమై ఉంటామని వెల్లడించారు. ఇప్పటికే పలువురు జర్నలిస్టులు హుధుద్ సమయంలోనూ., కరోనా సమయంలోనూ ఇబ్బందులు ఎదుర్కొన్నారని గుర్తు చేశారు. విధి నిర్వహణలో కొందరు జర్నలిస్టులు ప్రాణాలను సైతం కోల్పోయారని విచారం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో స్మార్ట్ సిటీ అసోసియేషన్ తరపున అధ్యక్షులు శ్రీ బంగారు అశోక్ కుమార్ సభ్యులైన ప్రతి ఒక్కరికి వారి కుటుంబ సభ్యులకు అవసరమైన సేవలను అందించడం అభినందనీయమన్నారు. ఇప్పటికే రక్తదాన శిబిరాలు ఉచిత వైద్య శిబిరాలు పేద విద్యార్థులకు సహాయ కార్యక్రమాలు ఇలా పలు విధాలుగా జర్నలిస్టులు వారి కుటుంబ సభ్యులకు అశోక్ కుమార్ అండగా నిలిచారని గుర్తు చేశారు. సభకు అధ్యక్షత వహించిన స్మార్ట్ సిటీ రిపోర్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు బంగారు అశోక్ కుమార్ మాట్లాడుతూ అసోసియేషన్ తరపున అందించే ప్రతి సేవా కార్యక్రమంలో ఎందరో అందిస్తున్న సహాయ సహకారాలు ఉన్నాయన్నారు. అత్యధిక సంఖ్యలో జర్నలిస్టులకు సహాయపడడంలో దొరికే ఆనందం మాటలతో చెప్పలేనిది అన్నారు. తమ ఈ లక్ష్యానికి చేదోడుగా నిలుస్తున్న దాతలు పోలీసులు సామాజిక సంఘ సేవ ఆసక్తి పరులు, రాజకీయ పక్షాలు ఇతరులు అందరికీ అసోసియేషన్ కృతజ్ఞత ఉంటుందన్నారు. నిబద్ధత క్రమశిక్షణలతో జర్నలిస్టులు వారి కుటుంబ సభ్యులను ఆదుకోవాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నా రిపోర్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సొంతంగా ఒక భవనాన్ని ఏర్పాటు చేసుకోవడం ద్వారా అవసరమైన నిధులను సమకూర్చుకొని అవసరమైన అన్ని సేవలను అందించగలిగితే తమ లక్ష్యం నెరవేరినట్లేనని ఈ సందర్భంగా స్మార్ట్ సిటీ రిపోర్ట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు అశోక్ కుమార్ వెల్లడించారు. ఇదే కార్యక్రమంలో సభ్యులైన వారికి ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని ఉగాది పచ్చడి స్వీట్స్ నిత్యావసర సరుకులు వంటివి అతిధుల చేతులమీదుగా పంపిణీ చేశారు అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ సమర్పణ చేశారు. హాజరైన సభ్యులకు ఉగాది పచ్చడి విందు అందజేశారు.ఈ కార్యక్రమంలో ఎస్. సి.ఆర్.డబ్ల్యూ. ఏ కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.