విశాఖపట్నం జిల్లా పశుగణాభి వృద్ధి సంస్థ కార్యాలయం లో 15వ సర్వసభ్య సమావేశం.

 విశాఖపట్నం జిల్లా పశుగణాభి వృద్ధి సంస్థ కార్యాలయం లో 15వ సర్వసభ్య సమావేశం.

మంత్రివర్యలు ముత్తం శెట్టి శ్రీనువాసరావు ఆదేశాలకి అనుగుణంగా  విశాఖపట్నం జిల్లా పశుగణాభి వృద్ధి సంస్థ కార్యాలయం లో 15వ సర్వసభ్య సమావేశం ఛైర్మన్ గాడు వెంకటప్పడు అధ్యక్షతన నిర్వహించడమైనది . 
ఈ సమావేశంలో సంస్థ యొక్క లక్ష్యాలు ,సాధించిన ప్రగతి గురించి చర్చించడమైనది  . ఇందులో భాగంగా రైతుభరోసా కేంద్రాలలో కృత్రిమ గర్భధారణ సేవల  తీరు ఫై సమీక్ష జరిపి పశు సంవర్ధక సహాయకులకు నైపుణ్యత పెంపొందించుటకు శిక్షణా కార్యక్రమాలు చేపట్టి రైతులకు మరింత మెరుగైన సేవలు అందించుటకు ప్రతిపాదించడమైనది .ప్రభుత్వ కార్యక్రమాలైన ఆనిమల్ ఫీడ్ ఆక్ట్ 2020,ఏపీ బొవైన్ బ్రీడింగ్ ఆక్ట్ 2021, పశు సంవర్ధక శాఖ అధికారులచే పాల సేకరణ కేంద్రాలలో లీగల్ మెట్రోలాజి ఇన్స్పెక్షన్ల నిర్వహణ గురించి రైతులలో అవగాహన కల్పించి తద్వారా అభివృద్ధి సాధించుటకు ప్రతిపాదించడమైనది .రాబోయే ఆర్థిక సంవత్సరంలో పాడి రైతులను ప్రోత్సహించుటకు పశు సంపద ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో పశు గర్భకోశవ్యాది చికిత్సా శిబిరాలు ,లేగదూడల ప్రదర్శన మరియు పాలపొటీలు సంస్థ ద్వారా నిర్వహించుటకు తీర్మానించడమైనది. ఈ సందర్భంగా కృత్రిమ గర్భధారణా సేవల విభాగంలో జాతీయ స్థాయిలో అత్యుత్తమ పనితీరుతో ప్రధమ బహుమతి సాధించిన జిల్లాకు చెందిన గోపాలమిత్ర కర్రి రామారావును సత్కరించడమైనది.చైర్మన్ ము‌ందుగా అందరకీ తెలుగు సంవత్సరాది  (ఉగాది) శుభాకాంక్షలు తెలయజేసారు. ఈ కార్యక్రమం లో  సంస్థ సభ్యులు, ఈఓ డా.బి. రామ్మోహన్ , డాక్టర్ సురేష్  ఇతర అధికారులు మరియు ఆపీస్ సిబ్బంది పాల్గున్నారు.