ఆమ్ ఆద్మీ పార్టీ ఆధ్వర్యంలో సోమవారం జరిగినటువంటి ట్రాన్స్జెండర్ ఆత్మీయ సభ విజయవంతం.
విశాఖ లోకల్ న్యూస్ ప్రతినిధి
ఆమ్ ఆద్మీ పార్టీ ఆధ్వర్యంలో సోమవారం జరిగినటువంటి ట్రాన్స్జెండర్ ఆత్మీయ సభ విజయవంతంగా ముగిసింది అని అన్నారు. సోమవారం జరిగినటువంటి సభకు ముఖ్య అతిథిగా క్యాంపెనింగ్ యాక్టివిస్ట్ విష్ణు తేజ కూడా రావడం జరిగింది అని అన్నారు. ఈ కార్యక్రమంలో ట్రాన్స్ జెండర్ సమాజంలో ఎదుర్కొంటున్నటువంటి వారి సమస్యలను మాకు తెలియజేస్తూ అదేవిధంగా ఆమ్ ఆద్మీ పార్టీకి కూడా మద్దతు పలకడం కూడా జరిగింది అని తెలిపారు.ఇందుకు ఆమ్ ఆద్మీ పార్టీ సభ్యులు సానుకూలంగా స్పందించి సమాజంలో గుర్తుండేలాగా వాళ్లకు కూడా మంచి స్థానం కల్పిస్తామని హామీ ఇచ్చారు.ఆదివారము నాడు ఆర్ .కె . బీచ్ లో జరగబోయే లజీబీటక్ మార్చ్ ర్యాలీ కి ఆహ్వానించారు.అందుకు గాను ఆప్ సభ్యులు సానుకూలంగా స్పందించడం జరిగింది. త్వరలో ఆప్ నుండి ఈ లజీబీటక్ సెల్ నీ పెట్టడానికి ఆమ్ ఆద్మీ పార్టీ కసరత్తులు మొద్దలపెట్టడం కూడా జరగుతుంది అని అన్నారు.ఈ కార్యక్రమంలో స్టేట్ ఉమెన్ కన్వీనర్ డాక్టర్.శీతల్, విశాఖ సౌత్ నియోజకవర్గ కన్వీనర్ మైలపల్లి శ్రీనివాస్, నార్త్ నియోజకవర్గ కన్వీనర్ అవినాష్, ఈస్ట్ కన్వీనర్ సాయిరాం, బీమిలి కన్వీనర్ నిమ్మకాయల భాస్కర్, మీడియా ఇంచార్జ్ తోట యల్లజీ రావు, కే ఎం రాజు, కృష్ణ భగవానుడు, లక్ష్మి, మురళి బాబు, షీబా రెడ్డి, విష్ణు తేజ, అనంత్, నవీన్ పాల్గొన్నారు.

.jpeg)