నేషనల్ హైవే అధికారులకు వినతి పత్రం సమర్పించిన: కొరాడ నాగభూషణం


 వ్యాపారులకు ప్రత్యామ్నాయం కావాలి

 కోరాడ నాగభూషణ డిమాండ్

ఆనందపురం :విశాఖ లోకల్ న్యూస్ ప్రతినిధి

 వేములవలస కూడలిలో ఫ్లైఓవర్ వంతెన ఏర్పాటు చేయడంతో ఉపాధి కోల్పోయిన వ్యాపారస్తులకు తక్షణం ప్రత్యామ్నాయం కల్పించాలని కోరుతూ స్థానిక మాజీ సర్పంచ్, భీమిలి మాజీ ఏఎంసీ చైర్మన్ కోరాడ నాగభూషణరావు  నేషనల్ హైవే అధికారులకు వినతి పత్రం సమర్పించారు. గతంలో ఈ కూడలి లో  సుమారు 100 మంది వ్యాపారులు తమ వ్యాపారాలు చేసుకొని ఉపాధి పొందేవారు. అయితే వంతెన ఏర్పాటు కావడంతో  వారి పరిస్థితి దయనీయంగా మారిందని కోరాడ నాగభూషణరావు అధికారులకు విన్నవించుకున్నారు.  వీరికి ప్రత్యామ్నాయం కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ కోరాడ నవీన్ జ్ఞానేశ్వర్, పతివాడ నరసింగరావు, నాచు మురళి తదితరులు పాల్గొన్నారు.