అయ్యన్న ఇంటిని టార్గెట్ చేయడం సమంజసం కాదు

అయ్యన్న ఇంటి గోడ కూల్చడం అప్రజాస్వామికం




 అయ్యన్న ఇంటి గోడ కూల్చడం అప్రజాస్వామికం

 ఆనందపురం: విశాఖ లోకల్ న్యూస్ ప్రతినిధి

 మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు ఇంటి ప్రహరీ గోడను కూల్చివేయడం అప్రజాస్వామికమని భీమిలి మాజీ ఏఎంసీ చైర్మన్ కోరాడ నాగభూషణరావు అతని తనయుడు టిడిపి యువ నాయకుడు వేములవలస ఉపసర్పంచ్ కోరాడ నవీన్ జ్ఞానేశ్వర్ లు ఖండించారు. 40 సంవత్సరాల రాజకీయ అనుభవం ఉండి ఎక్కడ మచ్చ లేని నాయకుడిగా  పేరొందిన అయ్యన్న ఇంటిని టార్గెట్ చేయడం సమంజసం కాదన్నారు. కేవలం రాజకీయ కక్ష సాధింపు చర్యలు కోసమే వైకాపా ప్రభుత్వం ఇటువంటి తప్పుడు నిర్ణయాలు తీసుకుంటుందని  పేర్కొన్నారు. ప్రతిపక్ష నాయకులను ముఖ్యంగా ప్రజలతో మమేకమైన నేతలను టార్గెట్ చేస్తే క్యాడర్ అంతా భయపడతారని అనుకుంటే పొరపాటేనని ఇలాంటి దుశ్చర్యలు ఇకనైనా మానుకోవాలని వారు సూచించారు. లేదంటే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు.