భీమిలి విశాఖ లోకల్ న్యూస్ ప్రతినిధి:
మార్కెట్ లోకి "హనీ జస్ట్ ఫ్రెష్" యాప్
నాణ్యమైన ఉత్పత్తులను దళారీల ప్రమేయం లేకుండా నేరుగా వినియోగదారులకు చేరువచేయాలనే సదుద్దేశంతో "హనీ జస్ట్ ఫ్రెష్" యాప్ అందుబాటులోకి తీసుకువచ్చినట్లు సన్ గ్రీన్ సీఈఓ కే.శృతి తెలిపారు.పితృదినోత్సవం సందర్భంగా ఆదివారం నాడు విశాఖ రుషికొండ ఐటీ హిల్స్ సమీపంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ప్రముఖుల, ఉత్పత్తి దారుల సమక్షంలో హనీ జస్ట్ ఫ్రెష్ యాప్ ప్రారంభించారు.ఈ సందర్భంగా శృతి మాట్లాడుతూ ఈ కామర్స్ కు ప్రాచుర్యం పెరిగిన నేపథ్యంలో నాణ్యమైన వివిద ఉత్పత్తులను నేరుగా అందుబాటుధరల్లో వినియోగదారులకు అందచేస్తామని తెలిపారు.ఎటువంటి రసాయనాలు వాడకుండా సేంద్రీయ ఎరువులతో పండించిన వివిధరకాల పళ్ళు,కూరగాయలు తమ "హనీ జస్ట్ ఫ్రెష్" యాప్ లో కొనుగోలు చెయ్యవచ్చని తెలిపారు. వైద్య పరీక్షలు, ఔషధాల సరఫరాదారులతో పాటు వివిధ విభాగాలకు చెందిన డిజిటల్ మార్కెటింగ్ వ్యక్తులు, రైతులు, ఇంటిలో తయారు చేసిన సరఫరాదారులతో విక్రేతలతో ప్లాట్‌ఫారమ్ రూపొందించినట్లు ఆమె తెలిపారు.నోబెల్ సీలింగ్ ఇన్ఫ్రా అండ్ డెకార్స్ అధినేత సునీల్ గరికిపాటి మాట్లాడుతూ సంప్రదాయబద్ధంగా పండించిన కూరగాయలతో పాటు పలువురు విక్రేతలతో రూపొందించిన యాప్ వినియోగదారులకు ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని తెలిపారు. తమ సంస్థ పూర్తి సహాయ సహకారాలు అందిస్తుందని హామీ ఇచ్చారు.హైదరాబాద్ కు చెందిన మై డ్రీం గ్రీన్ హోమ్ అధినేత నగునూరి రాకెష్ మాట్లాడుతూ సన్ గ్రీన్ సంస్థ రూపొందించిన "హనీ జస్ట్ ఫ్రెష్" యాప్ వినియోగదారులకు నాణ్యమైన ఉత్పత్తులు దళారీల ప్రమేయం లేకుండా నేరుగా లభిస్తాయని,యాప్ ప్రారంభించిన నిర్వహకులను అభినందించారు.ఈ కార్యక్రమంలో పాల్గొన్న సరఫరాదారులు,విక్రేతలు వెంకట్,గ్రేస్, జయలక్ష్మి,గిరి,కే.ఎస్.ప్రకాష్,రవి అరిశెట్టి,మహేష్,లాస్య లు మాట్లాడుతూ తమ ఉత్పత్తులు నేరుగా వినియోగదారులకు అందచేసేలా యాప్ రూపొందించిన సన్ గ్రీన్ సంస్థకు కృతఙ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో పలువురు రైతులు,సరఫరాదారులు పాల్గొని తమ ఉత్పత్తులను ప్రదర్శించారు.సన్ గ్రీన్ సంస్థ సలహాదారు సురేష్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

