ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో విశాఖ చిన్నారి శ్రీ ఇషిత

విశాఖ లోకల్ న్యూస్ ప్రతినిధి

 ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో విశాఖ చిన్నారి శ్రీ ఇషిత.

ఇంటర్నేషనల్ ఒలంపిక్ డే సందర్భంగా ముఖ్యఅతిథిగా ఈ రోజు బీచ్ లో ఒలంపిక్ రన్  లో  విశాఖ పశ్చిమ శాసనసభ్యులు గణబాబు మరియు పి.వి.జి.డి  ప్రసాద్  (ఎయు విసి) న్యూఆంధ్రప్రదేశ్ టైక్వాండో రాష్ట్ర సంఘం ప్రధాన కార్యదర్శి శ్రీ పి అచ్యుతారెడ్డి ,ఒలంపిక్ అసోసియేషన్ ప్రెసిడెంట్ డి ప్రసన్న కుమార్ మరియు స్పోర్ట్స్ అసోసియేషన్ బృందాలు పాల్గొన్నారు.


 ఈ కార్యక్రమంలో ఉత్తమమైన ప్రతిభ కనపరిచిన క్రీడకారులకు , కోచ్ లకు, వివిధ క్రీడా అసోసియేషన్ సెక్రెటరీ లకు సన్మానించారు. టైక్వాండో గేమ్ లో శ్రీ ఇషిత మరియు శ్రీ వ్రీషాగు కు ఒలింపిక్ అసోసియేషన్ మెడల్స్ మరియు సర్టిఫికేట్‌లను అందజేసారు.