భీమిలి విశాఖ లోకల్ న్యూస్
ముఖర్జీ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించిన : పి.వి.వి. ప్రసాదరావు పట్నాయక్,
భీమిలి నియోజకవర్గం ఆనందపురం మండలం వెల్లంకి
శ్రీశుభ బలరాం నిలయం లో గురువారం జన సంఘ్ వ్యవస్థాపకుడు డాక్టర్.'శ్యాం ప్రసాద్ ముఖర్జీ' ముఖర్జీ వర్ధంతి సందర్భంగా బిజేపి కిసాన్ మోర్చా ఉత్తరాంధ్ర సోషల్ మీడియా కన్వీనర్ పి.వి.వి. ప్రసాదరావు పట్నాయక్, ఆధ్వర్యంలో శ్యాంప్రసాద్ ముఖర్జీ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.ఈ సందర్భంగా బిజేపి కార్యకర్తలకు ప్రధాన మంత్రి,ఈ- శ్రమ్ కార్డులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి బిజేపి ఆనందపురం మండల పార్టీ అధ్యక్షులు మీసాల రాము నాయుడు,బిజేపి రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ ఉప్పాడ అప్పారావు, మాట్లాడుతూ
ఈ సందర్భంగా స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి జాతీయవాద ఆలోచనను ప్రోత్సహించి, జాతీయ సమైక్యత కోసం పట్టుదలతో పని చేసిన మహోన్నతుడు శ్యాం ప్రసాద్ ముఖర్జీ అని కొనియాడారు..బిజేపి విశాఖ జిల్లా మహిళా మోర్చా ఉపాధ్యక్షురాలు,యేలూరి ధర్మవతి, కార్యదర్శి,మాదా బత్తుల బుజ్జి మాట్లాడు తూ స్వాతంత్య్రం వచ్చిన తరువాత ఆయన తన భావజాలం తో.. సుధీర్ఘ పోరాటంతో దేశ రాజకీయ వ్యవస్థపై చెరగని ముద్ర వేసుకున్నారన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు జిల్లా కిసాన్ మోర్చా కార్యదర్శి, గండి లక్ష్మి రావు, అనందపురం మండల మహిళా మోర్చా అధ్యక్షురాలు అల మండ లక్ష్మి, బిజేపి సీనియర్ నాయకులు బోర శ్రీను, అనందపురం మండల ఎస్సీ మోర్చ అధ్యక్షులు మల్లారపు క్రిష్ణ, దుక్క అప్పల సూరి బీజేపీ కార్యకర్తలు పాల్గొన్నారు.

