చెత్త పన్ను రద్దు చేయాలి సీపీఎం డిమాండ్
భీమిలి: విశాఖ లోకల్ న్యూస్
కొమ్మాది 100 అడుగుల ప్రధాన రహదారికి ఎస్సీ కాలనీ సి సి రహదారికి ర్యాంపు నిర్మాణం చేసి అనుసందించలని,చెత్త పన్ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం ఉదయం 36 వ సచివాలయం వద్ద ధర్నా నిర్వహించారు.ఈ సందర్భంగా సీపీఎం మధురవాడ జోన్ కార్యదర్శి డీ అప్పలరాజు మాట్లాడుతూ కోమ్మాది కూడలి నుండి ప్రధాన రహదారి నిర్మాణం చేసే క్రమంలో ఎత్తు పెంచడం వలన కొమ్మది ఎస్సీ కాలనీ సుమారు 6 అడుగులు లోతు అయ్యిందని అన్నారు.అప్పట్లో కాలని ప్రజలు అందరు అధికారులను,రోడ్డు వేసే వారినీ కలిసి విన్నవించడం జరిగిందని,సిసి రహదారికి కలుపుతామని మాటిచ్చి ర్యాంపు నిర్మాణం చేయలేదని తెలియచేశారు.ఇప్పటికైనా ఈ రోడ్డు పూర్తి చేయాలని డిమాండ్ చేశారు.ఇంటి పన్నులు పెంచుతూ,కొత్తగా తెచ్చిన చెత్త పన్ను జి వో లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.చెత్త పన్ను బెదిరించి వసూళ్లు చేస్తున్నారని వెంటనే అటువంటి చర్యలు మానుకోవాలని హితవు పలికారు.పెంచిన విద్యుత్ చార్జీలు తగ్గించాలని డిమాండ్ చేశారు.నిత్యావసర ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయంటు ప్రభుత్వం వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు.అనంతరం సచివాలయం అడ్మిన్ భాస్కర్ కి వినతి పత్రాలు అందచేశారు.ఈ కార్యక్రమం లో సీపీఎం నాయకులు సియద్రి పైడితల్లి,ఎస్ నాగ రాజు,కె పుష్ప, ఎస్ శాంతి కుమారి,పైడిరాజు తదితరులు పాల్గొన్నారు.

