రియల్ ఎస్టేట్ వ్యాపారి పాచి రామకృష్ణ కేసు వివరాలు వెల్లడించిన ద్వారక ఏసీపీ ఆర్.వి.ఎస్.ఎన్ మూర్తి

రియల్ ఎస్టేట్ వ్యాపారి పాచి రామకృష్ణ కేసు వివరాలు వెల్లడించిన ద్వారక ఏసీపీ ఆర్.వి.ఎస్.ఎన్ మూర్తి.

మధురవాడ: విశాఖ లోకల్ న్యూస్


రియల్ ఎస్టేట్ వ్యాపారి పాచి రామకృష్ణ కేసు విషయమై శుక్రవారం ద్వారక ఆర్.వి.ఎస్.ఎన్ మూర్తి పి.ఎం.పాలెం స్టేషన్లో మీడియా సమావేశాన్ని ఏర్పాటుచేసి విషయాలను వెల్లడించారు. ముందుగా కిడ్నాపిం గ్ సమయంలో నిందితులు ఉపయోగించిన 2 కత్తులు, 4 సెల్ ఫోన్లు, కార్ తాళాలు మీడియా ముందు ఉంచారు.

 డబ్బు కోసం కిడ్నాప్ కేసు పిఎం పాలెం స్టేషన్ లో నమోదు అయింది.వెంకట హేమంత్ అనే రౌడీ షీటర్ డబ్బు అవసరం కోసం రామకృష్ణ అనే వ్యక్తిని కిడ్నాప్ చేసి కోటి రూపాయలు డిమాండ్ చేశాడు.మధు అనే రౌడీ షీటర్ అనే వ్యక్తితో వెంకట్ హేమంత్ కిడ్నాప్ విషయంలో కలిశాడు.మధు సూచనలు మేరకు ఈ కిడ్నాప్ చేయటానికి ఒప్పుకున్నారు.20 వ తారీఖున ఎంబీకే గెస్ట్ హౌస్ దగ్గరకి రమ్మను రామకృష్ణ కు చెప్పారు. రూం లోకి వెళ్ళిన వెంటనే ముందుగా ప్లాన్ చేసుకున్న విధంగా రామకృష్ణ ను చేతులు కాళ్ళు కట్టేసి మూతికి కూడా ప్లాస్టర్ వేశారు. అక్కడ నుంచి దూరంగా ఒక ప్రైవేటు స్థలం దగ్గరకి తీసుకువెళ్ళి ప్లాస్టర్ తీశారు. గెస్ట్ హౌస్ వాళ్లకు అనుమానం వచ్చి పిఎం పాలెం సీఐ రవి కుమార్ కి ఫోన్ చేశారు కోటి రూపాయలు అడుగగా సాయంత్రానికి ఒక 50 లక్షలు ఇవ్వగలం అని రామకృష్ణ ఒప్పుకున్నారు. పోలీసులు వెబడించడం గమనించి రామకృష్ణ ను అలాగే డ్రైవర్ ను కార్ నుంచి తోసేసారు.ఈ హేమంత్ అనే వ్యక్తి కి సుబ్బలక్ష్మి అనే మహిళ కూడా ఉన్నారు గురువారం రాత్రి ఈ A1 వెంకట హేమంత్ A2 మున్నా A3 గోలగని పవన్ రాజ్ కుమార్ A4 పి కిరణ్ A5 మధు A6 సుబ్బలక్ష్మి ఆరుగురు ను అదుపులోకి తీసుకున్నాం వీరి దగ్గర నుంచి మారణా యుధాలు అలాగే మొబైల్ ఫోన్లు కూడా స్వాధీనం చేసుకున్నాం. A2,A5,A3 ఈ ముగ్గురిపై గతంలో నేర చరిత్ర ఉంది హేమంత్ మీద గతంలో 5 కేసులు అందులో ఒక మహిళ హత్య కేసు, దొంగతనం రోబరి కేసులు కూడా ఉన్నాయి రియల్ ఎస్టేట్ వ్యాపారం క్రమంలో హేమంత్ అనే వ్యక్తికి సుబ్బలక్ష్మి పరిచయం అయింది. ఇప్పటి వరకు సుబ్బలక్ష్మి బ్యాంక్ అకౌంట్ లో 36 లక్షలు రూపాయలు ట్రాంజక్షన్ జరిగింది సుమారు ఒక సంవత్సరం నుంచి హేమంత్ తో పరిచయం ఉంది 345,323 ఇలా పలు సెక్షన్లు హేమంత్ పై పెట్టడం జరిగింది ఎస్ కోట అలాగే విజయనగరం జిల్లా గంట్యాడ లో కూడా హేమంత్ పై కేసులు పెట్టాము. పాచి.రామకృష్ణ మాట్లాడుతూ రుషికొండ లో సైట్ ఉందని సోమవారం సైటు దగ్గరకి రమ్మని ఫోన్ చేశారు.రూం కి తీసుకువెళ్లిన 5 నిమిషాల్లో నన్ను కిడ్నాప్ చేశారు కోటి రూపాయలు ఇవ్వాలి అని ఎవరికైనా ఫోన్ చేయమని చెప్పారు, సీఐ రవి కుమార్ ఫోన్ చేయగానే కిడ్నెపర్లు భయపడ్డారు, నన్ను అక్కడ వదిలేయడం తో అక్కడి నుంచి ఆటో లో భీమిలి కి వెళ్ళిపోయాను నాకు జూన్ 3 వ తారీఖు నుంచి వీళ్లతో పరిచయం ఏర్పడింది గతంలో ఆరు నెలలు క్రితం కూడా ఒక సైటు ఉందని వేరే వాళ్ళు ద్వారా నాకు ఫోన్ చేశారు.