విద్యుత్ షాక్ తో భవన నిర్మాణ కార్మికుడు మృతి.
తాడేపల్లి:
తాడేపల్లి నులకపేట సెంటర్ లో ఉన్న మడమల సంజీవరావు - సంపూర్ణ కళ్యాణ మండపం వెనుక వైపు పనిచేస్తుండగా విద్యుత్ వైర్లు తగిలి విజయవాడ కృష్ణ లంక కు చెందిన భవన నిర్మాణ కార్మికుడు అక్కడికక్కడే మృతి చెందాడు. విద్యుత్ వైర్లు పని ప్రదేశానికి అతి దగ్గరగా ఉండటం ఈ ప్రమాదానికి కారణమని తోటి కార్మికులు తెలిపారు. కరంట్ వైర్లు ప్రమాదంగా ఉన్నాయని కళ్యాణ మండపం వారికి ముందుగానే తెలిపిన కూడా నిర్లక్ష్యం వహించడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని తెలుస్తోంది. మృతి చెందిన భవన నిర్మాణ కార్మికుడకు న్యాయం చేయాలని తోటి కార్మికులు, కుటుంబ సభ్యులు కోరుతున్నారు. అదేవిధంగా నిర్లక్ష్యంగా వ్యవహరించిన కళ్యాణ మండపం యజమానులపై తగు చర్యలు తీసుకోవాలని కార్మికులు కోరుతున్నారు.
