గాయత్రి ఇంజినీరింగ్ కళాశాల లో మాదక ద్రవ్యాలకు బానిస కాకుండా ఉండేందుకు అవగాహన సదస్సు
మధురవాడ : జూన్ 26 వ తేదీన జరిగే అంతర్జాతీయ మత్తు పదార్థాల విరోధ దినం సంద్భంగా శుక్రవారం నాడు కొమ్మాది గాయత్రి ఇంజినీరింగ్ కళాశాల లో సదస్సు జరిగింది. ఈ సదస్సులో పాల్గొన్న విద్యార్థులను, ఉపాధ్యాయ ఉపధ్యేతర సిబ్బందిని ఉద్దేశిస్తూ భారత మానసిక వైద్య సంఘం జాతీయ అధ్యక్షుడు డా. ఎన్.ఎన్.రాజు, యువత మాదక ద్రవ్యాలకు బానిస కాకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన విధి విధానాలను వివరించారు. అలాగే మాదక ద్రవ్యాలను నిరోధించే చట్టాలను వివరించారు. యువత భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని, వ్యసనాలకు దూరంగా ఉంటూ, చక్కని ప్రతిభా పాటవాలను ప్రదర్శించే రీతిలో ప్రణాళిక వేసుకోవాలని హితవు పలికారు. కౌన్సిలింగ్ అవసరమున్న వారు గాయత్రి ఆసుపత్రి లోని మానసిక వైద్య విభాగ నిపుణుల సలహా తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్ కోటేశ్వర రావు, డా. అనూష, డా. పవన్ కుమార్, డా. శ్రావణి, డా. పద్మినీ, మానసిక శాస్త్ర నిపణులు శ్రీమతి కల్యాణి, ఇతర సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా డా.ఎన్.ఎన్.రాజుని ఘనంగా సత్కరించారు.

