ప్రజా సమస్యలు పరిష్కారం కోసమే ఇంటింటికీ సీపీఎం.

ప్రజా సమస్యలు పరిష్కారం కోసమే ఇంటింటికీ సీపీఎం

విశాఖపట్నం :

నగర కార్యదర్శి వర్గ సభ్యులు అర్ కే ఎస్ వి కుమార్.

ఇంటింటికీ సీపీఎం కార్యక్రమం గురువారం మారికవలసా, శారద నగర్ ప్రాంతం లో నిర్వహించారు.ఈ కార్యక్రమం లో సీపీఎం నగర కార్యదర్శి వర్గ సభ్యులు అర్ కే ఎస్ వి కుమార్ పాల్గొన్నారు. ఇంటింటి కి వెళ్లి ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈసందర్భంగా మరికవలస ప్రాంతం లో కలువల సమస్యలు,త్రాగు నీరు సక్రమంగా రావడం లేదని స్థానికులు తెలియ జేశారు.శారద నగర్ లో కొండపైన వున్న ఇండ్లకు త్రాగు నీరు కొలాయిల ద్వారా రావడం లేదని, ఈ కారణంగ నీటి కోసం ఇబ్బందులు పడుతున్నామని తెలియ జేశారు.చెత్త పన్ను వసూలు కు,వలెంటర్ల ద్వారా బెదిరింపులకు ప్రభుత్వం పూనుకుందని అన్నారు.ఇంటి పన్ను 500 రూ నుండి 700 రూ,350 రూ 530 రూ కి పెరిగిందని స్థానికులు చెబుతున్నారు.ఈ సందర్బంగా కుమార్ మాట్లాడుతూ ప్రజలు కుటుంబమంతా శ్రమించిన వచ్చిన ఆదాయంతో జీవించడం కష్టంగా మారిందని అన్నారు.ప్రజలు తమ సమస్యలపై పోరాటం చేయడమే ఏకైక మార్గం అని అన్నారు.ఈ కార్యక్రమంలో సీపీఎం కార్యకర్తలు డీ అప్పలరాజు, డీ కొండమ్మ, బి భారతి, ఎం కనకరాజు, కే సుజాత, ఏ గురుమూర్తి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.