చైతన్య కుటుంబానికి నష్టపరిహారం ఇవ్వాలని ధక్షిణ నియోజకవర్గ శాసన సభ్యులు వాసుపల్లి గణేశ్ కుమార్ కి వినతి.

చైతన్య కుటుంబానికి నష్టపరిహారం ఇవ్వాలని ధక్షిణ నియోజకవర్గ శాసన సభ్యులు వాసుపల్లి గణేశ్ కుమార్ కి వినతి.

విశాఖపట్నం :

41వ వార్డు జ్ఞానాపురం జే‌ఎన్‌ఎన్‌యూ‌ఆర్‌ఎం కాలనీ నందు 11కేవీ విధ్యుత్ తీగలు నివాసాలకు సమీపంగా ఉన్నందువలన అవి తగిలి 9సంవత్సరాల బాలుడు చైతన్య మరణించాడు. గతంలో కూడా ఇటువంటి ఎన్నో ప్రమాదాలు జరిగినప్పటికి ఏపిల‌ఈపిా‌డి‌సి‌ఎల్ వారు నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. వారి నిర్లక్ష్యం వలన ఒక నిండు ప్రాణం బలైపోయింది. కావున భాదిత కుటుంబానికి 20,00,000 రూపాయలు నష్టపరిహారం ప్రభుత్వం నుంచి అందించాలని 41వ వార్డు కార్పొరేటర్ కోడిగుడ్ల పూర్ణిమ మరియు శ్రీధర్ ధక్షిణ నియోజకవర్గ శాసన సభ్యులు వాసుపల్లి గణేశ్ కుమార్ కి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. నష్టపరిహారం చెల్లించిన ఆ తల్లితండ్రుల కడుపుకోతను తీర్చలేమని ఇది కేవలం చిన్న సహాయమని కార్పొరేటర్ కోడిగుడ్ల పూర్ణిమ విచారం వ్యక్తం చేశారు. వెంటనే ప్రమాదకరంగా ఉన్న విద్యుత్ తీగలను తొలగించాలని లేదా వాటి నుండి ప్రమాధాలు జరగకుండా రక్షణ ఏర్పాటు చేయాలని కోడిగుడ్ల శ్రీధర్ కోరారు.