అదనఫు తరగతి గదుల నిర్మాణం కి శంకుస్థాపన చేసిన అవంతి.

అదనఫు తరగతి గదుల నిర్మాణం కి శంకుస్థాపన చేసిన అవంతి.

విశాఖపట్నం :

ఆంద్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని చేపడుతున్న నాడు నేడు భాగంలో లక్ష్మి వారం నాడు భీమిలి నియోజకవర్గం ఎండాడ హైస్కూల్ లో కోటి తొంబై రెండు లక్షలు రూ అదనపు తరగతుల గదులు నిర్మాణం పనులు కు విశాఖ జిల్లా పార్టీ అధ్యక్షులు భీమిలి నియోజకవర్గం శాసనసభ్యులైన ముత్తంశెట్టి శ్రీనివాసరావు శంకుస్థాపన చేయడం జరిగింది కార్యక్రమం లో బాగంగా మహనీయుల విగ్రహాలకు పూల మాలలు వేసి సుమాంజలి ఘటించారు అనంతరం అవంతి గారు మాట్లాడుతూ వైసిపి ప్రభుత్వం వచ్చాక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి  విద్యా విధానంలో పలు సంస్కరణలు చేసారని అందులో భాగంగా నాడు నేడు ద్వారా  ఎండాడ హైస్కూల్ లో అదనపు తరగతుల గదులు నిర్మాణం కోసం పనులు ప్రారంభించడం జరిగింది అని ప్రభుత్వ పాఠశాలలను ప్రైవేటు స్కూల్ లైన కార్పోరేట్ స్కూల్ లు లా అన్ని విధాలా అభివృద్ధి చేస్తామని మాట్లాడారు ఈ కార్యక్రమంలో వార్డు కార్పోరేటర్ వార్డు ప్రెసిడెంట్ వివిధ కార్పోరేషన్ చైర్మన్ లు డైరెక్టర్ లు ఆయా ఆయా పదవుల్లో ఉన్న వారు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.