మండుటెండను సైతం లెక్క చేయక సేవలందిస్తున్న పోలీసుల రుణం తీర్చుకోలేనిది,
విశాఖపట్నం
ఆలిండియా హ్యూమన్ రైట్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు కొత్తలి గౌరి నాయుడు,
వేసవి ఎండలు మండిపోతున్న మండుటెండను సైతం లెక్కచేయకుండా వాహనదారులకు, ప్రయాణికులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా రోడ్లపై ఎండలో ట్రాఫిక్ ను క్లియర్ చేస్తూ సేవలందిస్తున్న పోలీసుల రుణం తీర్చుకోలేనిదని ఆలిండయా హ్యూమన్ రైట్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు కొత్తలి గౌరినాయుడు అన్నారు, గోపాలపట్నం ట్రాఫిక్ సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీహరి రాజును గురువారం ఆయన మర్యాదపూర్వకంగా కలిశారు, ఈ సందర్భంగా సర్కిల్ పరిధిలో ట్రాఫిక్ పోలీసులు ట్రాఫిక్ నియంత్రణ చేస్తూ వారు పడుతున్న ఇబ్బందులను ప్రజలకు చేస్తున్న సేవలను గూర్చి వారిరువురు చర్చించుకున్నారు, కరోనా కష్టకాలంలో శ్రీహరి రాజు పేదలకు వయోవృద్ధులకు భిక్షాటన చేసే వాళ్ళకి ఆయన ఎన్నో సేవలను అందించారని ఇటువంటి వ్యక్తులు పోలీసు వ్యవస్థకే గర్వకారణమని ఆయన కొనియాడారు, అదేవిధంగా ట్రాఫిక్ పోలీసులు ఎండైనా, వానైనా, విపత్తులు ఎదురైనా ఎంత కఠినమైన అప్పటికీ బాధ్యతతో ట్రాఫిక్ ను నియంత్రించటం వలన రోడ్డు ప్రమాదాలు జరగటం తగ్గుముఖం పడుతున్నాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు, అదేవిధంగా వాహనదారులు రోడ్లపై ప్రయాణించేటప్పుడు తప్పనిసరిగా హెల్మెట్ ను ధరించాలి అని ఎట్టిపరిస్థితుల్లోనూ త్రిబుల్ రైడింగ్ చేయకూడదని, వాహనాన్ని నడుపుతూ సెల్ ఫోన్ లో మాట్లాడకూడదని, సుఖమైన ప్రయాణం చేసి ప్రతి ఒక్కరు ఇంటికి చేరాలని ప్రయాణికులకు అవగాహన కల్పిస్తున్నామని అన్నారు, అనంతరం సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీ హరి రాజును ఆయన అభినందించారు ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ పోలీసులు తదితరులు పాల్గొన్నారు.