తిరుపతికి అవుటర్ రింగ్ రోడ్డు నిర్మాణం

తిరుపతికి అవుటర్ రింగ్ రోడ్డు నిర్మాణం.

తిరుపతి :

తిరుమల శ్రీవారి దర్శనానికి రోజూ వేల మంది వస్తుంటారు. వీరంతా తిరుచానూరు , జూపార్క్ రోడ్డు, మంగళం మీదగా తిరుమల కొండకు చేరుకోవాల్సి ఉంటుంది. ఆయా మార్గాల్లో నిత్యం రద్దీగా ఉంటుంది. ఈ క్రమంలో ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణం ప్రతిపాదన తెరపైకి వచ్చింది. దీనిపై నివేదిక ఇవ్వాలని కలెక్టర్ వెంకట్ రెడ్డి తుడా ఆదేశించారు . తిరునగరి కి ఓవైపు కొండ ఉండడంతో ఆ భాగాన్ని మినహాయించి రోడ్డు నిర్మిస్తారు.