4న వంగవీటి మోహన్ రంగా 75వ జయంతి వజ్రోత్సవ వేడుకలు*
రాధా - రంగా ఆర్గనైజేషన్ పోస్టర్ ను ఆవిష్కరించిన
ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు
బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి వంగవీటి మోహన్ రంగా 75 వ జయంతి సందర్భంగా జూలై 4న వజ్రోత్సవ వేడుకలు నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు తెలిపారు మంగళవారం స్థానిక హోటల్లో రాధా - రంగా ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశం లో ఈ కార్యక్రమానికి సంబంధించిన
పోస్టర్ ను ఎమ్మెల్యే గంటా శ్రీనివాస రావు ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు 125వ జయంతి అలాగే వంగవీటి మోహన్ రంగ 75 వ జయంతిని పురస్కరించు కుని నిర్వాహకులు భారీ ఎత్తున సేవా కార్యక్రమాలు చేపడుతున్నట్లు వెల్లడించారు జులై 4న మధ్యాహ్నం 12 గంటల నుంచి మనోరమ థియేటర్ వేదికగా భారీ అన్న సంతర్పణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారని తెలిపారు అదే రోజు విజయవాడలో ను హైదరాబాద్ లోను కూడా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు వంగవీటి మోహన్ రంగా సమాజాన్ని ప్రభావితం చేసిన గొప్ప వ్యక్తి అని కొనియాడారు అలాగే మన్యం వీరుడు అల్లూరి సీతారామ రాజు తన పోరాటంతో ఎంతో మంది లో స్ఫూర్తి రగిలించిన మహాను భావుడని తెలిపారు వీరిద్దరి పేరున ఇటువంటి గొప్ప కార్యక్రమాన్ని చేపడు తున్న నిర్వాహకులను ఆయన అభినందించారు ఈ కార్యక్రమంలో
రాధా రంగా రాయల్ అసోసియేషన్ నిర్వాహకులు గాదె బాలాజీ,కెవిఎస్ భాస్కర్,డాక్టర్ రామకృష్ణ కీర్తి,ఈటివి రంగారావు తదితరులు పాల్గొన్నారు.

