మధురవాడ:విశాఖ లోకల్ న్యూస్
ఘనంగా ముగిసిన 7వ జూనియర్ ఇంటర్ డిస్ట్రిక్ట్ బాస్కెట్ బాల్ ఛాంపియన్షిప్.*
క్రీడల ద్వారా సమాజంలో ప్రత్యేక గుర్తింపు.మంచి భవిష్యత్తుకు నాంది క్రీడలు* ... విశాఖ డిస్ట్రిక్ట్ బాస్కెట్ బాల్ అధ్యక్షులు సునీల్ మహంతి.
బాలుర విభాగంలో కృష్ణాజిల్లా, బాలికల విభాగంలో అనంతపురం ప్రథమ స్థానం.
పసి వయసు నుంచి క్రీడల మీద దృష్టి పెడితే బంగారు భవిష్యత్తుకు పునాదులు వేసినట్లేనని విశాఖ డిస్ట్రిక్ట్ బాస్కెట్ బాల్ అధ్యక్షులు సునీల్ మహంతి అన్నారు.ఆంధ్ర ప్రదేశ్ బాస్కెట్ బాల్ అసోసియేషన్,విశాఖ డిస్ట్రిక్ట్ బాస్కెట్బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 7వ జూనియర్ ఇంటర్ డిస్టిక్ బాలబాలికల బాస్కెట్ బాల్ ఛాంపియన్షిప్-2022 గీతం యూనివర్సిటీ శ్రీకోడి రామమూర్తి క్రీడాప్రాంగణంలో ఘనంగా ముగిసాయి.4రోజులు పాటు నిర్వహించిన ఈ బాస్కెట్ బాల్ పోటీలలో రాష్ట్రంలో గల13 జిల్లాల నుంచి క్రీడాకారులు హాజరయ్యారు.బాలుర విభాగంలో కృష్ణాజిల్లా, బాలికల విభాగంలో అనంతపురం ప్రథమ స్థానం, ద్వితీయ స్థానంలో బాలుర విభాగంలో అనంతపూర్ బాలికల విభాగంలో ఈస్ట్ గోదావరి.నిలిచాయి.రాష్ట్ర స్థాయిలో జరిగిన ఈపోటీలలో ఉత్తమ ప్రదర్శన కనబరిచిన క్రీడాకారులను గుర్తించి భారతదేశం తరఫున బాస్కెట్ బాల్ ఆడేందుకుఎంపిక చేస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు.కార్యక్రమంలో విశిష్ట అతిథులుగా వై గౌతమరావు ప్రొఫెసర్ వైస్ఛాన్సలర్ (క్యాంపస్ లైఫ్),డి.ఎస్.వర్మ జాయింట్ జి.ఎం.హెచ్-ఆర్ ఏ,ఎం/ఎన్,ఎస్, వైయస్సార్ సిపి నాయకులు ద్రోణంరాజు శ్రీవాత్సవ్,పాల్గొన్నారు.
ఈ సందర్భంగా విశాఖ డిస్ట్రిక్ట్ బాస్కెట్ బాల్ అధ్యక్షులు సునీల్ మహంతి మాట్లాడుతూ క్రీడల వలన శారీరిక దృఢత్వంతో పాటు మానసిక పరిపక్వత కలుగుతుందని అన్నారు. రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయిలో గుర్తింపు పొందితే ప్రభుత్వ ఉద్యోగాలు పొందే అవకాశం ఉంటుందని తెలిపారు.అలాగే సమాజంలో మంచి పేరు తెచ్చుకునే అవకాశం ఉంటుందని ఆయన పేర్కొన్నారు.కార్యక్రమంలో
టి.ఎస్. ఆర్.ప్రసాద్,రిటైర్డ్ అడిషనల్ ఎస్.పి,చైర్మన్ వీ.డి.బి.ఏ.,జి చక్రవర్తి.సెక్రటరీ ఆంధ్రప్రదేశ్ బాస్కెట్బాల్ అసోసియేషన్, హనుమంతరావు వైస్ ప్రెసిడెంట్ వి.డి.బి.ఏ, జి భూషనరావు.సెక్రటరీ వి.డి.బి.ఏ,ఆర్ రేవతి ట్రెజరర్ ఏ.పీ.బి.ఎ.,తిమ్మారెడ్డి.విశాఖ వ్యాలీ స్కూల్ ప్రిన్సిపాల్ ఈశ్వరి,సీ.ఐ.బాలకృష్ణ ముఖ్య అతిథులుగా.. పోటీలకు ఎస్ కె మహంతి. రిజినల్ లేబర్ కమిషనర్ పర్యవేక్షకునిగా వ్యవహరించారు.

