అమ్మఒడి 3విడత కార్యక్రమం లో భీమిలి శాసనసభ్యులు అవంతి శ్రీనివాస్.

 అమ్మఒడి 3విడత కార్యక్రమం లో భీమిలి శాసనసభ్యులు అవంతి శ్రీనివాస్.

విశాఖ లోకల్ న్యూస్:

జీవీఎంసీ జోన్ టు మధురవాడ చంద్రంపాలెం ఉన్నత పాఠశాలలో అమ్మఒడి 3వ విడత కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముందుగా మాజీ మంత్రి ,వైస్సార్ సీపీ విశాఖ జిల్లా అధ్యక్షులు   భీమిలి నియోజకవర్గం శాసనసభ సభ్యులు అవంతి శ్రీనివాసరావు, సరస్వతి దేవి విగ్రహానికి పులామాల వేసి అనంతరం జ్యోతి వెలిగించి కార్యక్రమాన్ని ప్రారంభించారు.అమ్మఒడి మూడో విడత సోమవారం విడుదల చేసిన అర్హత జాబితాలో లేనివారు నిజంగా అర్హులైనవారు సంబంధిత సచివాలయ వెల్ఫేర్ సెక్రెటరీ వద్ద నమోదు చేసుకుంటే వాటిని పునః పరిశీలన చేసి అమ్మఒడి రెండో విడత జులై 19 తారీకున విడుదల చేస్తారని తెలిపారు. చంద్రం పాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కు నాడు నేడు కింద 2కోట్ల 41లక్షల రూపాయలు విడుదల అయ్యాయని వాటినుండి పాఠశాల అభివృద్ధి చేస్తామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో విద్యాశాఖ అధికారిని డి.ఈ.ఓ చంద్రకళ, జీవీఎంసీ జోన్ టు కమిషనర్ ,బొడ్డేపల్లి. రాము,పాఠశాల ఉపాద్యాయులు రాజ బాబు,పాఠశాల చైర్మన్ బుడుమురి మీనా కుమారి,పాఠశాల,ప్రధాన ఉపాద్యాయురాలు జయప్రద,5వార్డు కార్పోరేటర్ మొల్లి హేమలత,7వార్డు కార్పోరేటర్ పిళ్ళా మంగమ్మ ,8 కార్పోరేటర్ లోడగల అప్పారావు , రాష్ట్ర నగరాల చెర్మెన్ పిళ్ళా. సుజాత సత్యనారాయణ,గదె రోసిరెడ్డి, చేకూరి రజని, పిల్ల కృష్ణ మూర్తి పాత్రుడు,తదితరులు పాల్గొన్నారు.