పూల మార్కెట్ తరలింపు యోచన పై విముఖత.

 పూల మార్కెట్ తరలింపు యోచన పై విముఖత.

విశాఖ లోకల్ న్యూస్:

మండలంలోని వేములవలస పూల మార్కెట్ కు ఉత్తరాంధ్ర లో మంచి పేరు ఉంది. అయితే ఈ మార్కెట్ ను వేరే ప్రాంతానికి తరలించి యోచన లో ఉన్న అధికారులు మంగళవారం ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టారు. ఇందులో భాగంగా డివిజనల్ పంచాయతీ అధికారి కృష్ణకుమారి వేములవలస సచివాలయంలో వివిధ పార్టీల నాయకులు రైతులతో చర్చించారు. అందరూ ఏకాభిప్రాయానికి వచ్చి తరలింపుపై విముఖత చూపారు. ఈ సందర్భంగా స్థానిక పంచాయతీ ఉప సర్పంచ్ కోరాడ నవీన్ జ్ఞానేశ్వర్ మాట్లాడుతూ పరిస్థితిని డిపీవో కు వివరించారు. తన తండ్రి నాగభూషణరావు మార్కెట్ అభివృద్ధికి ఎంతో కృషి చేశారన్నారు. 40 ఏళ్లుగా ఒకే దగ్గర మార్కెట్ లావాదేవీలు జరుగుతున్నాయని ఈ నేపథ్యంలో తరలిస్తే పంచాయతీ ఆదాయం కూడా పడిపోయే అవకాశం ఉందన్నారు. అనంతరం డిపిఓ కృష్ణకుమారి కి వినతి పత్రం అందజేశారు. నవీన్ జ్ఞానేశ్వర్ తో పాటు ఆసిల్ వేలంపాట నిర్వాహకుడు కోరాడ  రమణ, బోధ అప్పలరాజు, బోధ నారాయణప్పుడు,  తదితరులు పాల్గొన్నారు.