ప్లాస్టిక్ నిర్మూలనకు గాయత్రీ విద్యా సంస్థలు సహకారం ఎనలేనిది: జివిఎంసి కమిషనర్ డాక్టర్ జి. లక్ష్మీశ .

ప్లాస్టిక్ నిర్మూలనకు  గాయత్రీ విద్యా సంస్థలు సహకారం ఎనలేనిది: జివిఎంసి కమిషనర్ డాక్టర్ జి. లక్ష్మీశ  

విశాఖ లోకల్ న్యూస్:



ప్లాస్టిక్ నిర్మూలనకు గాయత్రి విద్యా సంస్థలు ఎంతో కృషి చేస్తున్నాయని జివిఎంసి కమిషనర్ డాక్టర్ జి. లక్ష్మీశ తెలిపారు. మంగళవారం 2వ జోన్ కొమ్మదిలోని గాయత్రీ విద్యా పరిషత్ మహిళా ఇంజినీరింగ్ కళాశాలలో ఆ సంస్థ ఆవరణలో ఏర్పాటు చేసిన ప్లాస్టిక్ నిషేధంపై అవగాహన కార్యక్రమంలో ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ప్రపంచాన్నే శాసిస్తున్న ప్లాస్టిక్ భూతాన్ని తరిమి, భావితరాల వారికి మంచి వాతావరణం కల్పించాలని తెలిపారు.ప్లాస్టిక్ వలన జరిగే అనర్ధాలు మా కంటే మీకే ఎక్కువ తెలుసని, ప్లాస్టిక్ భూమిలో కలవడానికి వందల సంవత్సరాలు పడుతుందని, దానివలన మానవ మనుగడతో పాటు పశుపక్ష్యాదులు, జల జీవరాశులకు హాని ఏర్పడుతుందని, అందుకు తక్షణమే ప్లాస్టిక్ ను విడనాడాలని తెలిపారు. జూన్-5వ తేదీ నుండి మన విశాఖ నగరంలో ప్లాస్టిక్ ను పూర్తిగా నిషేధించామని అందుకు వ్యాపారస్తులు, సంస్థలు, నగర ప్రజలు సహకరిస్తున్నారని, మన నగరం ఎంతో సుందరమైన నగరమని, మన నగరానికి దేశవిదేశాల నుండి ఎంతోమంది పర్యాటకులు సందర్శనార్ధం వస్తారని, వారికి మంచి ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించాల్సిన బాధ్యత మనదేనని, ప్లాస్టిక్ ఫ్రీ సిటీగా దేశంలోనే మన విశాఖ నగరం నిలిస్తుందని తెలిపారు. ప్లాస్టిక్ వస్తువులను యువత పూర్తిగా వ్యతిరేకించాలని, తద్వారా భావితరాల వారికి ఆరోగ్యంతో పాటు పర్యావరణ జరుగుతుందని తెలిపారు. గాయత్రి విద్యా సంస్థ యాజమాన్యం కూడా ప్లాస్టిక్ నిషేధంపై విస్తృత కార్యక్రమాలు నిర్వహిస్తుందని, కాలేజి విద్యార్ధులు అందుకు సహకరించి, మీ పరిధిలో ఎటువంటి ప్లాస్టిక్ వినియోగించకూడదని గుడ్డ, నార, కాగితపు సంచులు ప్రజలు వాడే విధంగా ప్రోత్సహించాలని కమిషనర్ తెలిపారు.ఈ కార్యక్రమంలో అదనపు కమిషనర్ ఎస్.ఎస్. వర్మ, ప్రధాన వైద్యాధికారి డాక్టర్ కెఎస్ఎల్ జి శాస్త్రి, జోనల్ కమిషనర్ బొడ్డేపల్లి రాము, గాయత్రి విద్యా సంస్థల ప్రెసిడెంట్ ప్రో. దక్షిణామూర్తి, సెక్రటరి సోమరాజు, ప్రిన్సిపాల్ శ్రీ గోస్వామి, సిబ్బంది, విద్యార్దినిలు, తదితరులు పాల్గొన్నారు.