రోయల్ కల్చరల్ క్లబ్ ఆత్మీయ సమావేశం లో పాల్గొన్న అవంతి

రోయల్ కల్చరల్ క్లబ్ ఆత్మీయ సమావేశం లో పాల్గొన్న అవంతి.

విశాఖ లోకల్ న్యూస్ :

ఆనందపురం మండలం రామవరం గ్రామంలో రోయల్ కల్చరల్ క్లబ్ అసోసియేషన్ వారు ఆదివారం నాడు ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశం లో విశాఖ జిల్లా పార్టీ అధ్యక్షులు భీమిలి నియోజకవర్గం శాసనసభ్యులైన ముత్తంశెట్టి శ్రీనివాసరావు పాల్గొనడం జరిగింది కార్యక్రమం లో బాగంగా అసోసియేషన్ వారు అవంతి కి పుష్ప గుచ్చం అందించి శాలువాతో సన్మానించడం జరిగింది అనంతరం అవంతి శ్రీనివాసరావు మాట్లాడుతూ కాపులు సంక్షేమ కోసం అభివృద్ధి కోసం అన్నివేళలా ముందుంది,అలాగే అన్ని విధాలా సహాయ సహకారాలు అందించడం కోసం ముందుంటాది,అలాగే కాపు సామాజిక భవనం నిర్మాణం కోసం ఎండాడ లో 50 సెంట్లు భూమిని కూడా కేటాయించడం జరిగింది కాపు సామాజిక వర్గం జగన్మోహన్ రెడ్డి కి అండగా ఉండాలని మాట్లాడారు ఈ కార్యక్రమంలో రోయల్ కల్చరల్ క్లబ్ అసోసియేషన్ సభ్యులు పాల్గొనడం జరిగింది.