వివిధ రకాల చేపలు ఒకే చోట... సందర్శనకు ఉచితం గా ఉంచిన విశాఖ వాసి


 భోగాపురం:విశాఖ లోకల్ న్యూస్

వివిధ రకాల చేపలు ఒకే చోట... సందర్శనకు ఉచితం గా ఉంచిన విశాఖ వాసి* :  

 *విశాఖపట్నం* : ఎన్నో రకాల చేపలు, అందమైన రంగురంగుల చేపలు, నిండుగా కొలనుల్లో ఈదుతూ కనిపించే చేపలు. అలాగే ఇవి ఒకే దేశానికి చెందినవి కావు. ఎన్నో దేశాల నుంచీ ఇక్కడకి వచ్చి ఇలా కన్నుల విందు చేస్తున్నాయి. ఇవి చూడాలంటే విశాఖపట్నం  రావాల్సిందే. వైజాగ్  నగరానికి సమీపంలోని భోగాపురం వెళ్లాల్సిందే. అక్కడ కనిపించే చేపల్ని చూసి అందరూ కళ్లారబెట్టాల్సిందే. విశాఖకి చెందిన ఓ ప్రకృతి ప్రేమికుడు తన రిసార్ట్ లో చేపల్ని పెంచుతూ ఔరా అనిపిస్తున్నారు. ఎన్నో రకాల మత్స్యసంపదను చిన్నపాటి అక్వేరియంలలో పెంచుతూ అబ్బుర పరుస్తున్నాడు. ఇక్కడ కనిపించే రంగు రంగుల చేపలను చూడానికి రెండు కళ్లూ సరిపోవు. ఇవన్ని వివిధ దేశాలకు చెందినవి. చిన్న పిల్లలు వీటి వద్ద గంటల కొద్దీ సమయం గడుపుతున్నారు.

చేపలను తాకుతూ, వాటితో ఆటలాడుకోవచ్చు. వాటికి ఆహారమూ పెట్టవచ్చు. ఇన్ని వెరైటీల చేపలను ఒకే దగ్గర ఉంచారు విశాఖపట్నం నగరానికి చెందిన రామరాజు. వీటిని సేకరించడానికే ఆయనకు చాలా సమయం పట్టింది. రొయ్యలు, చేపల చెరువులు నిర్వహించే రామరాజుకు వివిధ దేశాలకు చెందిన చేపలను సేకరించడం హాబీ. అలా 25 దేశాలకు చెందిన చేపలను సేకరించారు. మొదట ఇంటిలోని అక్వేరియంలో పెంచడం మొదలు పెట్టి, చేపల సంఖ్య పెరుగుతూ ఉండటంతో తనకున్న రిసార్ట్ లో చేపల కోసం ప్రత్యేకమైన ట్యాంక్ లను నిర్మించి అక్కడ పెంచుతున్నారు. వీటిని చూసేందుకు రిసార్ట్ కు వచ్చే సందర్శకులను ఉచితంగా అనుమతిస్తున్నారు. ఇక్కడున్న ఒక్కో చేప ఒక్కో రకం. వివిధ దేశాలకు చెందినవి. ఇవి ఎక్కడపడితే అక్కడ పెరగవు. అందుకే వీటికి అవసరమైన వాతావరణ పరిస్థితులను క్రియేట్ చేశారు. అలాగే చాలా వాటికి తగ్గట్టు ట్యాంక్స్ నిర్మించారు. ఇక్కడున్న చేపల విలువ లక్షల్లో ఉంటుంది. అలాగే ఇది ఖరీదైన చేపల అడ్డా. ఆహారం కోసం 3 అడుగుల వరకు పైకి ఎగిరే చేపలు ఇవి. దీన్ని చైనీస్ లక్కీఫిష్‌గా భావిస్తారు. జపాన్ కు చెందిన అందమైన కోయికార్పో చేపలు, విద్యుత్ షాక్ ఇచ్చే ఎలక్ట్రిక్‌ ఈల్‌, రంగులు మార్చే అస్కార్ చేప దక్షిణామెరికాకు చెందినవి. మొసళ్లను తలపించే అరాపిమా, అలిగేటర్ గేర్ చేపలు, మనుషుల్ని గుర్తుపట్టే గొరామీ చేపలు, నీటిని కీటకాలపై విసిరి చంపే ఆర్చర్‌ చేపలు వంటివి అనేకం ఇక్కడ ఉన్నాయి. ఇలా ఇన్ని రకాల చేపలను ఒకే చోట చూడటం, రంగు రంగుల చేపలను చేతులతో పట్టుకుని ఆడుకోవడం చాలా సరదాగా ఉంటుంది. సందర్శకుల కోసం వీటిని ప్రదర్శనకు ఉంచారు. ఇక్కడకి రావడానికి ఎలాంటి ఎంట్రన్స్ ఫీజులు లేవు.