తల్లి ఫొటో చూసి మురిసిపోయిన మోడీ.
ప్రధాని నరేంద్ర మోడీకి సిమ్లాలో ఓ అభిమాని నుంచి అపూర్వమైన బహుమతి లభించింది. కేంద్ర ప్రభుత్వం 8 ఏండ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా హిమాచల్ ప్రదేశ్ లోని సిమ్లాలో గరీబ్ కళ్యాణ్ సమ్మేళన్ లో ప్రధాని మోడీ ప్రసంగించారు. రోడ్ షో సందర్భంగా ప్రధానికి స్వాగతం పలికేందుకు నగరంలోని మాల్ రోడ్ వీధుల్లో భారీ సంఖ్యలో కార్యకర్తలు, అభిమానులు, మద్దతుదారులు బారులు తీరారు. జనం మధ్య మోడీ తల్లి హీరాబెన్ మోడీ పెయింటింగ్ ను ప్రధానికి కనిపించింది. ఓ అమ్మాయి వేసిన పెయింటింగ్ ను స్వీకరించేందుకు ప్రధాని తన కారును ఆపడంతో జనాలు ఆశ్చర్యపోయారు. ఈ అమూల్యమైన ఫొటోను మోడీకి ఇవ్వడంతో ఆయన ఆనందంతో ఉప్పొంగిపోయారు. ప్రధాని అమ్మాయిని కలుసుకుని పెయింటింగ్ ను స్వీకరించారు. అనంతరం మోడీ కాసేపు అమ్మాయితో మాట్లాడారు. ఈ పెయింటింగ్ నువ్వే వేశావా అని అడిగారు. దానికి సమాధానంగా నేనే వేశానని చెప్పింది. పెయింటింగ్ వేయడానికి ఎంత సమయం పట్టిందని ప్రధాని ప్రశ్నించగా..ఆ డ్రాయింగ్ వేయడానికి ఒక రోజు పట్టిందని చెప్పింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

