పీతలవానిపాలెంలో కల్వర్టు పనులకు శంకుస్థాపన.
విశాఖ లోకల్ న్యూస్ :విశాఖపట్నం ప్రతినిధి
పిఠాపురం కాలనీలో ఓపెన్ జిమ్ ఏర్పాటు
రూ.14.45 లక్షలతో యూజీడీ పనులు పూర్తి
కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్
వార్డు సమస్యలు పరిష్కారం తో పాటు, అభివృద్ధి పథంలో నడిపించడమే ధ్యేయంగా పని చేస్తానని జీవీఎంసీ 22వ వార్డు పీతల మూర్తి యాదవ్ చెప్పారు. వార్డులోని పీతలవానిపాలెంలో రూ.1.74లక్షల నిధులతో కల్వర్టు పనులకు బుధవారం ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మూర్తి యాదవ్ మాట్లాడుతూ వార్డులో న్యూరేసపువానిపాలెంలోరూ.14.45 లక్షలతో భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ పనులు పూర్తి చేశామన్నారు. పిఠాపురం కాలనిలో యువత కోసం ఓపెన్ జిమ్ ఏర్పాటు చేశామన్నారు. అలాగే వార్డులో ఇప్పటికే రోడ్ల మరమ్మతులు, విద్యుత్ దీపాలు ఏర్పాటు వంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి స్థానిక సమస్యలను పరిష్కరించామన్నారు. ఈ కార్యక్రమంలో సివిల్ వర్క్స్ ఏఈ సత్యశ్రీ, ఎమినెట్స్ సెక్రటరీ రవితేజ, వర్క్ ఇన్స్పెక్టర్ రామారావు, సాయి, పీతల మధుసూదనరావు, పెసల శ్రీను, ఒమ్మి శోభన్ కుమార్, పీతల రాజేష్ తదితరులు పాల్గొన్నారు.

