మున్సిపల్ కార్మికుల జీతాలు వెంటనే చెల్లించాలి సీఐటీయూ

మున్సిపల్ కార్మికుల జీతాలు వెంటనే చెల్లించాలి సీఐటీయూ.

విశాఖపట్నం :

జి వి ఎం సి లో అవుట్ సోర్సింగ్ విభాగంలో పని చేస్తున్న కార్మికులకు వెంటనే బకాయి వేతనాలు విడుదల చేయాలని మున్సిపల్ కాంట్రాక్ట్,ఔట్ సోర్సింగ్ వర్కర్స్ యూనియన్ సీఐటీయూ ఆధ్వర్యంలో జోన్ 2 కమిషనర్ బీ రాము ని కలిసి వినతి పత్రం అందజేశారు.ఈ సందర్భంగా సీఐటీయూ నాయకులు జెడ్ సి తో మాట్లాడుతూ ఆప్ కాస్ లో నమోదు అయిన కార్మికులకు రెండు నెలలు,నమోదు కానీ కార్మికులకు 6 నెలలు,2021 వ సంవత్సరంలో చేరిన కార్మికులకు 8నెలలు జీతాలు బకాయిలు వున్నాయని తెలియజేశారు.జోన్ 3,4,5 జీతాలు విడుదల చేశారని తెలియ జేశారు.జోన్ 2 కార్మికుల జీతాలు విడుదల చేసేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. ఇల్లు గడవడంతో పాటు,రోజు వారి ప్రయాణ కర్చులకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని అన్నారు.అప్పులు కూడా పుట్టడం లేదని తెలియజేశారు.జోనల్ కమీషర్ వెంటనే సంబంధిత అధికారుల తో మాట్లాడి జీతాలు విడుదల చేయాలని ఆదేశించారు.ఈ కార్యక్రమంలో సీఐటీయూ నాయకులు డీ అప్పలరాజు, కే రాజు, ఏ భవాని,కే రాజేశ్వరి, ఎస్ కుమారి,సి హెచ్ రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు.