ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల లో లబ్ధిదారులను తగ్గించడమే ప్రభుత్వ లక్ష్యం:పిట్టా సురేష్..

ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల లో లబ్ధిదారులను తగ్గించడమే ప్రభుత్వ లక్ష్యం. పిట్టా సురేష్ 

విశాఖపట్నం :భీమిలి 

             ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల లబ్ధిదారులను ప్రతీ ఏడాది కొత్త నిబంధనలు జోడించి కోత విధించుకుంటూ లబ్ధిదారులను తగ్గిస్తూనే వస్తుంది. ఏదైనా ఒక పథకానికి కావలసిన అర్హతలు, నియమ- నిబంధనలు దరఖాస్తు చేసుకోవడానికి ముందే ప్రకటించాలి కానీ, ఇలా ప్రతి ఏడాది నిబంధనలు మార్చుకుంటూ పోతూ ప్రజలను ఇబ్బంది పెట్టడం తగదు.

సంక్షేమ పథకాల లబ్ధిదారులను తగ్గించడం కోసమే రాష్ట్రం లో మొదటగా సుమారు 7 లక్షల తెల్ల రేషన్ కార్డులను తొలగించారు. 

ఈ ఏడాది 2022 జూన్లో విడుదలైన అమ్మబడి పథకానికి బ్యాంకు లింకేజీ, ఆధార్ లింకేజీ, ఆన్లైన్ అవ్వలేదని, ఇంటి విస్తీర్ణం ఎక్కువుందని, అవుట్సోర్సింగ్ ఉద్యోగం,300 యూనిట్లు కంటే ఎక్కువ విద్యుత్ వినియోగం, కరెంట్ మీటర్లు లింకేజీ అంటూ రకరకాల కారణాలతో అమ్మబడి లబ్ధిదారులను అనర్హులు గా ప్రకటించారు. గత ఏడాది వరకు వచ్చిన పథకాలు ఇప్పుడు డబ్బులు వేసే సమయానికి అనర్హుల జాబితా లోకి వెళ్ళిపోయారని తెలిసిన అమ్మబడి తల్లుల బాధ వర్ణనాతీతం.

2020 లో మీరందరూ ఇళ్ల పట్టాలు పొందేందుకు అర్హులే అంటూ వేలాదిమందికి హామీ పత్రాలు ఇచ్చి వారి సంఖ్యను మూడోవంతు కన్నా తక్కువ మందికి తగ్గించి అర్హులను ప్రకటించారు. మిగిలిన వారిని అనర్హులని చెబుతూనే, మీకు రెండో విడతలో వచ్చే ఏర్పాటు చేస్తామని కొంతమంది నాయకులు నమ్మ పలుకుతూ వారిని బుజ్జగిస్తున్నారు.

2019 తర్వాత వివిధ రకాల కొర్రీలు వేసి వైస్సార్ పెన్షన్ కానుక  పొందుతున్న లబ్ధిదారులను తొలగించారు. ఈ నెలలో నీకు పెన్షన్ చేయిస్తామని నమ్మబలుతూ తమ చుట్టూ కొంతమంది నాయకులు తిప్పుకుంటూనే ఉన్నారు. మరి ఎక్కడైనా ఫిర్యాదు చేస్తే నీకు పెన్షన్ రానివ్వనని సచివాలయం సిబ్బంది కూడా బెదిరిస్తున్నారు. మీ పెన్షన్లు రావాలన్నా, పోవాలన్న ఆన్లైన్లో అప్లోడ్ చేయాల్సింది మేమే అని, నేను చెప్పినట్లు వినాలని హెచ్చరిస్తున్నారు. పథకాలు అమలు చేయడం చేతకాక చేతులెత్తేస్తున్న ప్రభుత్వం.