22 వ వార్డ్ లో ఘనంగా ఇళ్ల స్థలాల పంపిణీ కార్యక్రమం: పట్టాలందించిన కార్పోరేటర్ పీతల మూర్తి యాదవ్.
విశాఖపట్నం :
గ్రేటర్ విశాఖ 22 వ వార్డ్ లో ఇళ్ల స్థలాల పంపిణీ కార్యక్రమం గురువారం ఘనంగా జరిగింది. కార్పోరేటర్ పీతల మూర్తి యాదవ్ చేతుల మీదుగా లబ్దిదారులకు పట్టాలు అందజేశారు.వార్డ్ పరిధిలోని రాజీవ్ నగర్ ,బలరాం నగర్ ,పిఠాపురం కాలనీ,నేతాజీ నగర్,న్యూ రేసపువానిపాలెం ,పీతలవానిపాలెంలలోని ఏడు సచివాలయాల పరిధిలోని లబ్దిదారులకు నేరుగా ఇళ్లస్థలాల పట్టాలు అందజేశారు. ఈ సందర్భంగా కార్పోరేటర్ పీతల మూర్తి యాదవ్ మాట్లాడుతూ నిరుపేదలను ఇళ్ల స్థలాలకు అర్హులుగా గుర్తించామని చెప్పారు. ఇల్లు స్థలం లేని నిరుపేదలు తహసీల్దార్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
వార్డ్ లోని దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించడానికి చిత్తశుద్ధితో కృషి చేస్తున్నానని అన్నారు.అధికార పార్టీ నాయకులు ప్రజాస్వామ్యాన్ని గౌరవించాలని సూచించారు.ఈ కార్యక్రమంలో సచివాలయ కార్యదర్సులు,వీఆర్వో లు,లబ్ధిదారులు పాల్గొన్నారు.

