సిపిఐ రాష్ట్ర మహాసభను జయప్రదం చెయ్యండి ! జిల్లా కార్యదర్శి మరుపిళ్ల పైడిరాజు

మధురవాడ:విశాఖ లోకల్ న్యూస్
 

సిపిఐ రాష్ట్ర మహాసభను జయప్రదం చెయ్యండి ! జిల్లా కార్యదర్శి మరుపిళ్ల పైడిరాజు

48 సంవత్సరాల తరువాత ఆగస్టు 26 తేదీ నుండి 28 వ తేదీ వరకు మూడు రోజులు పాటు విశాఖపట్నంలో జరగబోయే సిపిఐ రాష్ట్ర మహాసభ జయప్రదం చెయ్యడానికి కార్యకర్తలు శక్తి వంచన లేకుండా కృషి చెయ్యాలని పార్టీ జిల్లా కార్యదర్శి మరుపిళ్ల పైడిరాజు విజ్ఞప్తి చేశారు.

గురువారం మధురవాడ మల్లయ్యపాలెం లో నిర్వహించిన ఏరియా సమావేశంలో పాల్గొని పైడిరాజు మాట్లాడుతూ భారత  స్వాతంత్ర్య సంగ్రామ పోరాట నేపథ్యంలో 1925 లో ఆవిర్భవించిన సిపిఐ పార్టీ గడిచిన 97 సంవత్సరాలనుండి పేద, మధ్యతరగతి సామాన్య ప్రజలు ఎదుర్కొంటున్న అనేక సమస్యలు పరిస్కారం కోసం రాజీలేని పోరాటాలు నిర్వహించడం జరుగుతున్నద ని, అడ్డు అదుపులేకుండా పెంచుకుపోతున్న నిత్యావసర వస్తువులు ధరలు, పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరలు తగ్గించాలని నిన్నదిస్తున్న సిపిఐ పార్టీ రాష్ట్ర మహాసభ జయప్రదం చెయ్యడానికి ప్రజలు ఆర్ధికంగా, హార్దికంగా సహాయం అందించి జయప్రదం చెయ్యాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు

అనంతరం మధురవాడ ఏరియా సిపిఐ కార్యదర్శిగా వాండ్రాసి సత్యనారాయణ* సహాయ కార్యదర్శిగా గిడుతూరి వేళంగినిరావు, కమిటీ సభ్యులుగా కొల్లి మేఘారావు, ఎం డి బేగం, కె అరుణ్ కుమార్, బి కేశవయ్య ఎం ఎస్ పాత్రుడు లను ఏకగ్రీవముగా ఎన్నుకున్నారు.