జగన్ నీవు...చరిత్ర హీనులుగా మారిపోతావు గుర్తు పెట్టుకో తేదేపా రాష్ట్ర బీసీ సెల్ ఉపాధ్యక్షుడు గొల్లంగి ఆనందబాబు


 భీమిలి : విశాఖ లోకల్ న్యూస్

జగన్ నీవు...చరిత్ర హీనులుగా మారిపోతావు గుర్తు పెట్టుకో            తేదేపా రాష్ట్ర బీసీ సెల్ ఉపాధ్యక్షుడు గొల్లంగి ఆనందబాబు!

మన ఆంద్రప్రదేశ్ కు గౌరవ హోదా దక్కాలన్నా, రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆంధ్రుల రుణం తీర్చుకోవాలన్నా ఇదే సరైన సమయమని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర బీసీ సెల్ ఉపాధ్యక్షుడు గొల్లంగి ఆనందబాబు ఒక ప్రకటనలో పేర్కొన్నారు.  ఇటీవల జరిగిన రాష్ట్రపతి ఎన్నికల్లో మన రాష్ట్రానికి చెందిన 22 మంది ఎంపీలు కేంద్రానికి ఉపయోగా పడే  రీతిలో వున్నారు, ఈ తరుణంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా అంశంపై కేంద్రం పై వత్తిడి తేవాలని అన్నారు.   రాష్ట్రానికి ప్రత్యేక హోదా తెచ్చి 151మంది ఎమ్మెల్యేలు, 22మంది ఎంపీలను ఇచ్చిన ఆంధ్రుల రుణాన్ని ముఖ్యమంత్రి జగన్ తీర్చుకోవాలని ఆనందబాబు అన్నారు.అట్లు కానీ పక్షంలో జగన్ నీవు...చరిత్ర హీనులుగా మరిపోతావు గురుతు పెట్టుకో అని తెలియ పరుస్తూ, ఇటువంటి పరిస్థితి లో ముఖ్యమంత్రి గా చంద్రబాబు నాయుడు ఉంటే ఈ 22 మంది ఎంపీ లను చూపి ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ కు కి ప్రత్యేక హోదా అడిగి తెచ్చేవారని రాష్ట్ర BC సెల్ ఉపాఢ్యక్షులు గొల్లంగి ఆనందబాబు ఆ ప్రకటనలో పేర్కొన్నారు.