అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన 98 వ వార్డు కార్పొరేటర్ పిసిని వరాహ నరసింహం*


 సింహాచలం సాయి నగర్,: విశాఖ లోకల్ న్యూస్

అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన 98 వ వార్డు కార్పొరేటర్ పిసిని వరాహ నరసింహం*

అభివృద్ధి పట్ల హార్షం వ్యక్తం చేస్తున్న గ్రామస్తులు భీమిలి  98వ వార్డ్ సాయి నగర్  ప్రాంతంలో అభివృద్ధి పనులకు 98వ వార్డ్ కార్పొరేటర్ పిసిని వరాహ నరసింహం సాయి నగర్ లో జరగనున్న 650 మీటర్ల కాలువ పనులు (డ్రైన్ లు) కు తొమ్మిది లక్షల (9 లక్షల ) రూపాయల జీవీఎంసీ  నిధులతో ఆభివృద్ధి పనులకు బుధవారం నాడు శంకుస్థాపన చేసారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ గుడ్ మార్నింగ్ కార్పొరేటర్ కార్యక్రమంలో వచ్చిన వినతి మేరకు సాయి నగర్ ప్రాంతంలో అభివృద్ధి పనులు దృష్యా నగర మేయర్,జీవీఎంసీ కమీషనర్ కు వినతి అందజేయడం జరిగిందని,జీవీఎంసీ ఏడాది పాలన పూర్తికి గాను అభివృద్ధి పనులకు నిధులు విడుదల చేయడం జరిగిందని అన్నారు.ఈ సందర్బంగా స్థానికుల సమక్షంలో కొబ్బరికాయ కొట్టి అభివృద్ధి పనులను ప్రారంభించారు.ఈ సందర్బంగా స్థానికులు మాట్లాడుతూ 98వ వార్డ్ కార్పొరేటర్ పిసిని వరాహ నరసింహం నేతృత్వంలో వార్డ్ అభివృద్ధి శరవేగంగా సాగుతుందన్నారు.మరింత అభివృద్ధి దిశగా ప్రజల కష్టసుఖాలలో పాలు పంచుకుంటూ నిరంతరం అభివృద్ధికై పాలన సాగిస్తున్నారని కొనియాడారు. ఇప్పటికే పలుసార్లు  పిసిని వరాహ నరసింహo పర్యటనలు చేశారని అన్నారు. స్థానిక సమస్యలను తెలుసుకుని వెంటనే పరిష్కరించేందుకు కృషి చేయడం అభినందనీయమన్నారు. తమ వార్డ్ పరిధిలో నిర్మాణ పనులు చేపట్టడం తమ అదృష్ట మన్నారు.ఎన్నో ఏళ్లుగా తమ కాలనీ లో కాలవలు సమస్యగా ఉందని వాటిని వెంటనే పరిష్కరించి నిర్మాణానికి చర్యలు చేపట్టడం సంతోషకరమన్నారు.ఈ కార్యక్రమంలో 98 వ వార్డ్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు పంచదార్ల శ్రీనివాస్, ఉపాధ్యక్షులు సిరిపురపు సురేష్, మజ్జి చంద్ర శ్రీనివాస్ కాకర వరహాలు మరియు స్థానికులు పాల్గొన్నారు.