విశాఖ రైల్వే స్టేడియం లో గల ఆర్ .ఆర్ . ఆక్వా స్పోర్ట్స్ నందు సమ్మర్ క్యాంప్

విశాఖ రైల్వే స్టేడియం లో గల ఆర్ .ఆర్ . ఆక్వా స్పోర్ట్స్ నందు సమ్మర్ క్యాంప్.

విశాఖ లోకల్ న్యూస్ :విశాఖపట్నం ప్రతినిధి 

రైల్వే స్టేడియం: వాటర్ స్పోర్ట్స్ పట్ల అవగాహన మరియు ప్రాముఖ్యతను పెంచడం.విశాఖ రైల్వే స్టేడియం లో గల ఆర్ .ఆర్ . ఆక్వా స్పోర్ట్స్ నందు సమ్మర్ క్యాంప్ నిర్వహిస్తున్న సందర్భంగా అకాడెమీ స్విమ్మింగ్ ట్రైనీ మాట్లాడుతూ పిల్లలకు, పెద్దలకు స్విమ్ చేయటం ద్వారా ఓర్పు, కండరాలను బలపరచడం మరియు కార్డియోవాస్కులర్ ఫిట్‌నెస్ లాంటి కలిగే ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని వివరించారు.ఆర్ ఆర్ ఆక్వా స్పోర్ట్స్ మే 2002 నెలలో 05 బ్యాచ్‌ల ఈవెనింగ్ సమ్మర్ క్యాంప్‌ను నిర్వహించింది అని, మరియు దాదాపు 120 మంది స్విమ్మర్‌లు కాని వారికి స్విమ్మర్లుగా ప్రతి బ్యాచ్‌కి 14 రోజుల స్వల్ప వ్యవధిలో శిక్షణ ఇచ్చిందనీ తెలిపారు. అంతేకాకుండా ఆర్ ఆర్ ఆక్వా స్పోర్ట్స్ నందు 03 రోజుల కోసం రూపొందించబడిన RLSS (రాష్ట్రీయ లైఫ్ సారింగ్ సిస్టమ్) లైఫ్ గ్రాండ్ కోర్సులను పరిచయం చేయడానికి ప్లాన్ చేసిందనీ, SAAP (స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్ర ప్రదేశ్)తో కలిసి ప్రత్యేకంగా జాబ్ ఆశావాదుల కోసం రూపొందించిన స్విమ్మింగ్ సర్టిఫికేషన్ కోర్సులను కూడా ప్రవేశపెట్టాలని యోచిస్తోందనీ విశాఖ వాసులు ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని అకాడెమీ స్విమ్ కోచ్ మోహన్, మరియు రాజేష్ తెలిపారు.