సత్యనారాయణ పేటలో రిటర్నింగ్ వాల్ నిర్మానానికి శంకుస్థాపన చేసిన కార్పొరేటర్ గాడు చిన్నికుమారి లక్ష్మి.

 సత్యనారాయణ పేటలో రిటర్నింగ్ వాల్ నిర్మానానికి శంకుస్థాపన చేసిన కార్పొరేటర్ గాడు చిన్నికుమారి లక్ష్మి.

విశాఖ లోకల్ న్యూస్ :భీమిలి ప్రతినిధి 

భీమిలి నియోజకవర్గం 2వ వార్డు లోని సత్యనారాయణపేట మీ సేవ కేంద్రం వెనుక కొండ ప్రాంతం వర్షాలకు కోరుకుపోవడం వలన కొండపై నివసిస్తున్న ప్రజలు ఆందోళన చెందుతున్నారు.గతంలో ఒకరు మరణించటం వల్ల స్థానికులు భయ బ్రాంతులకు గురయ్యి కార్పొరేటర్ దృష్టికి తీసుకువెళ్లారు వెంటనే కార్పొరేటర్ స్పంధించి స్థానికులకు భరోసా నిచ్చి స్థానిక కార్పొరేటర్ గాడు చిన్నికుమారి లక్ష్మి విశాఖ మున్సిపల్ కమీషనర్ లక్మీశ దృష్టికి తీసుకెళ్లి రిటర్నింగ్ వాల్ నిర్మాణానికి విజ్ఞప్తి చేసి నిధులు మంజూరు చేయించి బుధవారం శంకుస్థాపన కార్యక్రమం చేసారు.

ఈ కార్యక్రమం లో తెలుగుదేశం సీనియర్ నాయకులు గాడు అప్పలనాయుడు,మాజీ కౌన్సిలర్ చేట్ల రమణ, పిట్టా వెంకట్రావు,చేట్ల గురుమూర్తిరెడ్డి,చిల్ల అప్పలరెడ్డి సార్, బడిగింటి మహేష్, సరగడ గోపిరెడ్డి,రిక్క సత్యవతి, అలబాని కన్నా,జీరు సత్యం, జీరు ఈశ్వర్ రావు తదితరులు పాల్గొన్నారు.