పాత మధురవాడ, వాంబేకాలనీ, ఆర్ టి సి కాలనీ, గ్రామాల దేవత మొగదారమ్మ తల్లి జాతర మహోత్సవం.

 పాత మధురవాడ, వాంబేకాలనీ, ఆర్ టి సి కాలనీ, గ్రామాల దేవత మొగదారమ్మ తల్లి జాతర మహోత్సవం.

విశాఖ లోకల్ న్యూస్ :మధురవాడ ప్రతినిధి 

పాత మధురవాడ, వాంబేకాలనీ, ఆర్ టి సి కాలనీ, గ్రామాల దేవత మొగదారమ్మ తల్లి జాతర మహోత్సవం రెండు సంవత్సరాల కోసారి జరుపుకుంటారు. కరోనా మహమ్మారి వల్ల 2020జరగవలసిన ఉత్సవం నాలుగు సంవత్సరములతరువాత సోమవారం, మొదలు, మంగళవారం నాడు అంగరంగ వైభవంగా టేకుపూడి నర్సింగరావు ఆధ్వర్యంలో నిర్వహించారు. ముఖ్య అతిధులుగా,7వ కార్పొరేటర్, పిళ్ళా మంగమ్మ,పిళ్ళా వెంకటరావు దంపతులు,జనసేన భీమిలి నియోజకవర్గం ఇంచార్జ్ సందీప్ పంచకర్ల, హాజరయ్యారు.ఈ యొక్క జాతర లో రేలారే రేలా, బుర్రకత, లతో చుట్టుపక్కల గ్రామాలలో ప్రదర్శించి అలరించారు. నాలుగు సంవత్సరాల తరువాత జరిగిన జాతర మహోత్సవానికి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని తరించారు. ఈ యొక్క జాతర మహోత్సవం పాత మధురవాడ టేకుపూడి నర్సింగరావు ఆధ్వర్యంలో టేకుపూడి నర్సింగరావు,ఆల్తీ సన్యాసిరావు,మీసాల సత్యం, ఎర్రుబోతు కామరాజు, గోరీష్,, పేకెటి శ్రీనివాస్, ఆల్తి అప్పలరాజు, పసుపులేటి శివ, చందు సభ్యులు రెండు సంవత్సరాల కోసారి నిర్వహిస్తామని కరోనా మహమ్మారి వల్ల గతంలో 2020, లో నిర్హవహించలేదని ఈ ఏడాది కరోనా పూర్తిగా కట్టడి అవ్వటంతో అమ్మవారి దయవల్ల నిర్వహించగలిగామని తెలిపారు.