దొండపర్తి ప్రజాదర్బార్ లో ఎమ్మెల్యే వాసుపల్లి కి ప్రజాధరణ వెల్లువ


 దొండపర్తి ప్రజాదర్బార్ లో ఎమ్మెల్యే వాసుపల్లి కి  ప్రజాధరణ వెల్లువ.

విశాఖ లోకల్ న్యూస్ :విశాఖపట్నం ప్రతినిధి 

 విశాఖ దక్షిణ నియోజకవర్గ పరిధిలోని 41వార్డ్ దొండపర్తి పరదేసమ్మ గుడి దగ్గరలో విశాఖ దక్షిణ నియోజకవర్గ శాసన సభ్యులు వాసుపల్లి  గణేష్ కుమార్ ప్రజా సమస్యల తక్షణ పరిష్కారం కోసం నిర్వహించిన ప్రజాదర్బార్ లో అనేక మంది ప్రజలు విచ్చేశారు. ఎమ్మెల్యే వాసుపల్లి ప్రజాదర్బార్ కి ప్రజలు విశేష ఆదరణ లభిస్తోంది అని అన్నారు.

ముఖ్యంగా కొన్ని కారణాల వల్ల
పెన్షన్స్ కోల్పోయిన వారికి రోల్ బ్యాక్ చేయుటకు సెర్ప్  ద్వారా మంజూరు జాప్యం జరుగుతోందని ఎమ్మెల్యే దృష్టికి రాగానే ప్రభుత్వం దృష్టి కి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు.కొన్ని కారణాల వల్ల ఇళ్ల స్థలాలు కోసం హామీ పత్రాలు ఇచ్చి, పట్టాలు రానివారికి
& కార్యకర్తలకు ఇళ్ల స్థలాలు కేటాయించాలని జిల్లా కలెక్టర్ ని కోరారు. 27, 41 & 42 వార్డులో పాడైన రోడ్లు, కాలువలు పునఃనిర్మాణం కొరకు, అంగనవాడి భవనాలు పునరుద్ధరణ కొరకు, కొన్ని అపార్టుమెంట్లు లో సీసీ కెమెరాల నిఘా ఏర్పాటు చేయాలని వినతి పత్రాలు సమర్పించారు.ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే తో పాటు వైస్సార్సీపీ 42వార్డ్ కార్పొరేటర్ ఆళ్ల లీలావతి & శ్రీనివాస్,  41వార్డ్ ప్రెసిడెంట్ మైఖెల్ రాజు, 27వార్డ్ ప్రెసిడెంట్ నీలాపు సర్వేశ్వర రెడ్డి, వివిధ కార్పొరేషన్ డైరెక్టర్ లు స్టేట్ డైరెక్టర్ సకలబక్తుల ప్రసాద రావు, అమ్మాజీ, పీతల వాసు, వైస్సార్సీపీ స్టేట్ నాయకులు మన్యాల శ్రీనివాస్, జిల్లా సీనియర్ నాయకులు బులుసు జనార్దన్, బొర్రా శ్రీనివాస్ రెడ్డి, వేగి వెంకట అప్పారావు, అరుగుల రాజు, కొండ బాబు, కామరాజు, కృష్ణారెడ్డి, అజయ్ రెడ్డి, వాసు, కార్యకర్తలు, అనేక మంది ప్రజలు హాజరయ్యారు.
మరియు ప్రభుత్వ అధికారులు ఆర్ ఐ  సివిల్ సప్లై, హోసింగ్ డబ్ల్యూ ఐ  నాయుడు, జీవీఎంసీ వాటర్ సప్లై, టౌన్ ప్లానింగ్, ఎలక్ట్రికల్, యుజీడీ, సివిల్, శానిటేషన్ సిబ్బంది తదితరులు హాజరై ఎమ్మెల్యే సమక్షంలో పనులు పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు.