భద్రతా కారణాల రీత్యా ఇంటర్నెట్ ఆపడాన్ని అర్దం చేసుకోవచ్చు కానీ వారం గడుస్తున్నా ఇంటర్నెట్ సేవలు పునరుద్ధరణ జరగకపోవడం ప్రభుత్వ చేతకానితనానికి నిదర్శనం.
విశాఖ లోకల్ న్యూస్ :విశాఖపట్నం ప్రతినిధి
నేడు ప్రపంచం అంతా గుప్పెట్లోకి వచ్చి ఏ విషయం కావాలి అన్నా మన ముందుంచడానికి ఉపయోగ పడేది "ఇంటర్నెట్". కొద్ది గంటలు ఇంటర్నెట్ లేకపోతే అన్ని వ్యవస్థలు స్తంభించిపోతాయి. మనం తరచుగా కశ్మీర్ లోయలో అల్లర్లు జరిగినప్పుడు ఇంటర్నెట్ కట్ చేయడం విన్నాం.ఈ నెల 24 న కోనసీమ జిల్లా పేరు మార్చవద్దు అని అమలాపురం పట్టణంలో జరిగిన అల్లర్లు కారణంగా మరుసటి రోజు నుండి జిల్లా వ్యాప్తంగా ఇంటర్నెట్ ఆపేసింది ప్రభుత్వం. భద్రతా కారణాల రీత్యా ఇంటర్నెట్ ఆపడాన్ని అర్దం చేసుకోవచ్చు కానీ వారం గడుస్తున్నా ఇంటర్నెట్ సేవలు పునరుద్ధరణ జరగకపోవడం ప్రభుత్వ చేతకానితనానికి నిదర్శనంఅని హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా రాష్ట్ర ఉపాధ్యక్షుడు మాకినీడి మణికంఠ స్వామి అన్నారు. ఆయన మాట్లాడుతూ కరోనా కారణంగా వర్క్ ఫ్రమ్ హోం చేస్కుంటున్న ఐటీ ఉద్యోగులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. సుమారు 10000 మంది దాకా ఇబ్బంది పడుతున్నారు.ఇంటర్నెట్ కనెక్షన్ కోసం జిల్లా దాటి వెళ్ళి పని చేసుకోవాల్సి వస్తుంది. గూగుల్ పే,ఫోన్ పే, బ్యాంకింగ్ యాప్ ల యుగం ఇది ఇప్పుడు అక్కడ సౌకర్యాలు లేక ఇబ్బందులు పడుతున్నారు. సాధారణ పరిస్థితులు నెలకొన్నాయి అని ప్రభుత్వం చెప్తుంది మరి ఇంటర్నెట్ సేవలను పునరుద్ధరించకుండా ప్రభుత్వం ఎందుకు తాత్సారం చేస్తుంది?ఒకవేళ సాధారణ పరిస్థితులు అక్కడ రాలేదు అంటే మీ ప్రభుత్వ వైఫల్యం కాదా? కాబట్టి కోనసీమ జిల్లాలో ప్రజల ఇబ్బందులు గమనించి త్వరగా ఇంటర్నెట్ సేవలు అందుబాటులోకి తీసుకొని రావాలి అని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను.

