బైపిసి గ్రూపులో 965మార్కులు సాధించిన చిల్ల షర్మిళని అభినందించిన టీడీపీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్


 బైపిసి గ్రూపులో 965మార్కులు సాధించిన చిల్ల షర్మిళని అభినందించిన టీడీపీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్

భీమిలి; విశాఖ లోకల్ న్యూస్

ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో చిల్లపేటకు చెందిన చిల్ల కృష్ణ కుమార్తె చిల్ల షర్మిళ బైపిసి గ్రూపులో 965మార్కులు సాధించి బాసర కాలేజ్ టాపర్ గా నిలిచింది.

ఈ సందర్బంగా 2వ వార్డు కార్పొరేటర్, డిప్యూటీ ఫ్లోర్ లీడర్  గాడు చిన్నికుమారి లక్ష్మి, తెలుగుదేశం సీనియర్ నాయకులు గాడు అప్పలనాయుడు  విద్యార్థిని ఇంటికి వెళ్లి అభినందనలు తెలియజేసారు.ఉన్నత చదువులు చదివి తల్లిదండ్రులకి, పుట్టినఊరికి మంచి పేరు తేవాలని ఆశీర్వదించారు. ఈ కార్యక్రమం లో తెలుగుదేశం నాయకులు జీరు సత్యం, జీరు ఈశ్వర్రావు, చిల్ల అప్పలరెడ్డి సార్, సరగడ గోపి, చిల్ల ఎర్రయ్య రెడ్డి, చేట్ల కోటేశ్వరరావు, జీరు లక్ష్మి శీరపు త్రినాథమ్మ, జీరు అప్పలరెడ్డి, జీరు చిన్నసత్యం పాల్గొన్నారు.