భీమిలి:విశాఖ లోకల్ న్యూస్
అధ్వాన్నంగా సామాజిక మరుగుదొడ్లు
చర్యలు తీసుకోవాలని అధికారులకు 3వ వార్డు కార్పొరేటర్ గంటా అప్పలకొండ వినతి
భీమిలి జోన్ 3వ వార్డులో ఉన్న సామాజిక మరుగుదొడ్లు అధ్వానంగా ఉన్నాయని, అపరిశుభ్ర వాతావరణంతో ప్రజలు బేంబేలెత్తిపోతున్నారని , తక్షణమే అధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని భీమిలి జోన్ 3వ వార్డు కార్పొరేటర్ గంటా అప్పలకొండ కోరారు.
తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి, టెక్కలి నియోజకవర్గం పరిశీలకులు గంటా నూకరాజుతో కలసి విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. భీమిలి జోన్ 3వ వార్డు అయిన బోయవీధి, ఎగువపేట, తోటవీధి, రెల్లివీధి మరియు ఇతర మార్కెట్ యార్డ్ ల వద్ద సామాజిక మరుగుదొడ్లు ఉన్నాయని అన్నారు. వీటి నిర్వహణలో లోపం కారణంగా, నీటి కొరత కారణంగా మరియు ఇతర కారణాలు వలన అపరిశుభ్ర వాతావరణంతో అధ్వాన్న స్థితిలో ఉన్నాయని అన్నారు. ప్రస్తుతం వర్షాకాలం కారణంగా అంటువ్యాదులు ప్రభలే అవకాశం ఉన్నందున అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని కార్పొరేటర్ గంటా అప్పలకొండఅధికారులకు సూచించారు.
తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి గంటా నూకరాజు మాట్లాడుతూ వ్యక్తిగత మరుగుదొడ్లు వాడకం తక్కువగా ఉన్న ప్రాంతాల్లో ప్రజల సౌలభ్యం కోసం సామాజిక మరుగుదొడ్లు ప్రభుత్వ నిధులతో ఏర్పాటు చేశారని అన్నారు. గత ప్రభుత్వ హయాంలో ఎంతో వ్యయం చేసి ఆధునిక టెక్నాలజీతో నిర్మించారని, వాటి నిర్వహణ లోపం కారణంగా ప్రస్తుతం అపరిశుభ్ర వారావరణం సంతరించుకొని దుర్వాసనకు నిలయాలుగా మారాయని, ప్రజలకు కంటిమీద కునుకులేకుండా చేస్తున్నాయని అన్నారు. కొన్ని మరుగుదొడ్లకు నీటి సౌకర్యం లేకపోవడం, మరికొన్నింటికి కేర్ టేకర్స్ లేకపోవడం, ఇంకొన్నింటికి అసలు మౌలిక సౌకర్యాలు లేకపోవడం ఈ అధ్వాన్న స్థితికి కారణమని గంటా నూకరాజు అన్నారు. ఈనెల నుండి వర్షాలు ప్రారంభం కావడం వలన వర్షాకాలంలో వచ్చే సీజనల్ వ్యాధులను దృష్టిలో పెట్టుకొని ప్రజలకు ఎటువంటి అంటువ్యాదులు శోకకుండా ముందుగానే తగు జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. అదేవిధంగా బీచ్ లో ఉన్న టాయ్లెట్స్, మార్కెట్ యార్డ్ లో ఉన్న టాయ్ లెట్స్ నిర్వహణ కూడా అంతంతమాత్రంగా ఉన్నాయని దయచేసి అధికారులు సామాజిక మరుగుదొడ్లపై తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రతీ సామాజిక మరుగుదొడ్ల దగ్గర కేర్ టేకర్ ఉండేవిధంగా, వాటర్ సప్లయ్ నిర్విరామంగా ఉండేవిధంగా, అదేవిధంగా శుభ్రమైన వాతావరణం ఉండేవిధంగా చూసి అంటువ్యాధులకు ఎటువంటి అవకాశం లేకుండా చేయాలని గంటా నూకరాజు అధికారులకు విజ్ఞప్తి చేశారు.

