ఘనంగా ప్రారంభమైన 7వ జూనియర్ ఇంటర్ డిస్ట్రిక్ట్ బాస్కెట్ బాల్ ఛాంపియన్షిప్.*

ఘనంగా ప్రారంభమైన 7వ జూనియర్ ఇంటర్ డిస్ట్రిక్ట్ బాస్కెట్ బాల్ ఛాంపియన్షిప్.

 మధురవాడ: విశాఖ లోకల్ న్యూస్
 ఆంధ్రప్రదేశ్ బాస్కెట్ బాల్ అసోసియేషన్,విశాఖ డిస్ట్రిక్ట్ బాస్కెట్బాల్ అసోసియేషన్  ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 7వ జూనియర్ ఇంటర్ డిస్టిక్ బాలబాలికల బాస్కెట్ బాల్ ఛాంపియన్షిప్-2022 గీతం యూనివర్సిటీ శ్రీకోడి రామమూర్తి క్రీడాప్రాంగణంలో ప్రారంభమయ్యాయి.4రోజులు పాటు నిర్వహించే ఈ బాస్కెట్ బాల్ పోటీలలో రాష్ట్రంలో గల13 జిల్లాల నుంచి సుమారు 20 మంది బాస్కెట్ బాల్ కోచ్ లు హాజరయ్యారు. సుమారు 500 మంది బాస్కెట్బాల్ క్రీడాకారులు ఈ పోటీల్లో పాల్గొన్నారు.ఎస్ కె మహంతి. రిజినల్ లేబర్ కమిషనర్, ఎం రవీంద్రనాథ్.ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఏ.ఎం/ఎన్.ఎస్, అరుణ్ కార్తీక్.డైరెక్టర్ స్పోర్ట్స్ గీతం యూనివర్సిటీ, టి.ఎస్. ఆర్.ప్రసాద్,రిటైర్డ్ అడిషనల్ ఎస్.పి,చైర్మన్ వీ.డి.బి.ఏ., జి చక్రవర్తి.సెక్రటరీ ఆంధ్రప్రదేశ్ బాస్కెట్బాల్ అసోసియేషన్, హనుమంతరావు వైస్ ప్రెసిడెంట్ వి.డి.బి.ఏ, జి భూషనరావు.సెక్రటరీ వి.డి.బి.ఏ, ఆర్ రేవతి ట్రెజరర్ ఏ.పీ.బి.ఎ., తిమ్మారెడ్డి.విశాఖ వ్యాలీ స్కూల్ కరస్పాండెంట్, వి.ఎస్.వర్మ  ఈ,ఎస్,ఎస్,ఏ,అర్.స్టీల్స్. 
ముఖ్య అతిథులుగా పాల్గొని పోటీలను ప్రారంభించారు.ఈ పోటీలకు ఎస్ కె మహంతి. రిజినల్ లేబర్ కమిషనర్ పర్యవేక్షకునిగా వ్యవహరించారు.
ఈ కార్యక్రమంలో వక్తలు మాట్లాడుతూ.. క్రీడల వలన శారీరక దృఢత్వంతో పాటు మానసిక పరివర్తన వస్తుందని,రాష్ట్రస్థాయి జాతీయస్థాయి గుర్తింపుతో పాటు మంచి భవిష్యత్తు చేకూరుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.విద్యార్థి దశ నుంచే ఆటల పట్ల ఆసక్తిని పెంపొందించుకొని, నైపుణ్యంతో క్రీడల్లో రాణించాలన్నారు.విశాఖ డిస్ట్రిక్ట్ బాస్కెట్ బాల్ అధ్యక్షులు సునీల్ మహంతి మాట్లాడుతూ విద్యార్థి దశ నుంచే ఆటల పట్ల ఆసక్తిని పెంపొందించుకొని, నైపుణ్యంతో క్రీడల్లో రాణించాలన్నారు. క్రీడల ద్వారా శారీరక దృఢత్వంతో పాటు,మానసిక ఉల్లాసం వృద్ధి చెందుతుందన్నారు.పోటీలలో ముందుగా పురుషుల విభాగం నుండి విశాఖ..కడప జిల్లాలో క్రీడాకారులు పోటీపడ్డారు. అనంతరం మహిళల విభాగం నుండి శ్రీకాకుళం..చిత్తూరు జిల్లాల బాస్కెట్ బాల్ క్రీడాకారిణులు పోటీపడ్డారు. ఈ కార్యక్రమంలో ఆర్.సునీల్ రెడ్డి,పి.జగదీష్,గణేష్  తదితరులు పాల్గొన్నారు.