ఎమ్మెల్యే వాసుపల్లి ఆధ్వర్యంలో... విశాఖ దక్షిణంలో 14,500 ఇళ్ల పట్టాల పంపిణీ పండుగ.

 ఎమ్మెల్యే వాసుపల్లి ఆధ్వర్యంలో... విశాఖ దక్షిణంలో 14,500 ఇళ్ల పట్టాల పంపిణీ పండుగ.

విశాఖ లోకల్ న్యూస్:



ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సీఎం జగన్మోహన్ రెడ్డి దయవల్ల మన ఆంధ్ర రాష్ట్రంలో 31 లక్షల ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో భాగంగా....
 విశాఖ దక్షిణ నియోజకవర్గం పరిధిలో 35వార్డ్ ఇందిరాప్రియదర్శిని మునిసిపల్ స్టేడియంలో విశాఖ దక్షిణ నియోజకవర్గం శాసన సభ్యులు  వాసుపల్లి గణేష్ కుమార్ చేతుల మీదుగా 14,500మంది లబ్ధిదారులకు ఇళ్ల స్థలాల పట్టాలు పంపిణీ చేశారు.ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ...రాష్ట్రవ్యాప్తంగా దీంతోపాటు రాష్ట్రంలో 28.32 లక్షల ఇళ్ల నిర్మాణాన్ని తలపెట్టిన  మన ప్రభుత్వం ఇళ్ల నిర్మాణంలో తొలిదశలో 15.6 లక్షల ఇళ్ల నిర్మాణానికి కూడా శ్రీకారం చుట్టారని గుర్తుచేశారు.
ఎన్నికల మేనిఫెస్టో లో ఇచ్చిన హామీ ప్రకారం పేదల సొంతింటి కలను నెరవేరుస్తున్నానన్నారు.30 లక్షలమందికి పైగా పేదలకు సొంతింటి కలను నిజం చేశామన్నారు. ఇళ్ల స్థలం పరిమితి ఇప్పుడు 224 చదరపు అడుగులుండగా..340 చదరపు అడుగులకు పెంచారు. రాష్ట్రలో 17 వేల వైెఎస్ఆర్ జగనన్న కాలనీలు రానున్నాయని...
.కొత్తగా ఏర్పడే కాలనీల్లో తాగునీరు, రోడ్లు, డ్రైనేజీ, విద్యుత్ సౌకర్యం, పార్క్‌లు, కమ్యూనిటీ హాల్స్, విలేజ్ క్లినిక్‌లు, అంగన్ వాడీ కేంద్రాల్ని ప్రభుత్వమే ఏర్పాటు చేస్తుందని సీఎం జగన్  చెప్పిన మాటను ఈ సందర్బంగా ప్రజలకు తెలియజేసారు. ఈ సైట్ ఉచితంగా ఇవ్వటమే కాకుండా ప్రతీ ఒక ఇంటి నిర్మానానికి ₹.1,80,000/- లు సబ్సిడీ అమౌంట్ మంజూరు చేస్తుంది మరియు అదనంగా SHG లోన్స్ ద్వారా ₹.35,000/- లు పావలా వడ్డీ 3% కూడా మంజూరు చేసే అవకాశం ప్రభుత్వం కల్పిస్తుంది.
ఒక్క విశాఖపట్నం లోనే మొదటి విడతగా  100000 ఇల్లు నిర్మానానికి శ్రీకారం చుట్టారు