మాతృభూమి సేవ సంఘం మరియు హెల్పింగ్ హ్యాండ్స్ హిజ్రా అసోసియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో నిత్య అన్నదాన కార్యక్రమం.

 మాతృభూమి సేవ సంఘం మరియు హెల్పింగ్ హ్యాండ్స్ హిజ్రా అసోసియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో నిత్య అన్నదాన కార్యక్రమం.

విశాఖ లోకల్ న్యూస్:

మాతృభూమి సేవ సంఘం మరియు హెల్పింగ్ హ్యాండ్స్ హిజ్రా అసోసియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో విశాఖపట్నం జిల్లా మాతృభూమి సేవా సంఘం అధ్యక్షులు రాజు గోవ కార్యదర్శి సురేష్ సమక్షంలో గత 51 రోజులుగా జరుగుతున్న రోడ్డు పక్కన ఉన్న అన్నార్తుల కోసం నిత్య అన్నదాన కార్యక్రమంలో ముఖ్య అతిధిగా తిప్పల దేవన్స్ రెడ్డి పాల్గొని మాతృభూమి సేవ సంఘం మరియు హెల్పింగ్ హాండ్స్ హిజ్రా అసోసియేషన్ చేస్తున్న సేవా కార్యక్రమాలు అద్భుతమని అన్ని దానాల కన్నా అన్నదానం గొప్పది అని పేదల ఆకలి తీర్చడంలో ఉన్న సంతోషం మరి ఎక్కడ లభించదని ఈ సంస్థ నడుపుతున్న గోపాల్ రావు కొండబాబు నిత్య అన్నదాన కార్యక్రమం ఆ సొంత నియోజకవర్గం గాజువాకలో చేయడం చాలా ఆనందాన్ని కలిగించిందని స్వచ్ఛంద సంస్థలు చేస్తున్న సేవా కార్యక్రమాలకు మా సహకారం ఎప్పుడూ ఉంటుందని తెలియజేశారు. ఈ కార్యక్రమ నిర్వాహకులు దేవడ కొండబాబు ఇప్పల వలస గోపాల్ రావు మాట్లాడుతు ఈ కార్యక్రమం గత 51 రోజులుగా విజయవంతం కావడానికి సహకరించిన దాతలకు ముఖ్యంగా రాజు గోవ, పోతులు చిన్న, రామకృష్ణ, సురేష్ కీ అభినందనలు తెలియచేస్తూ 51రోజులు పూర్తి చేసుకున్న సందర్బంగా నిరుపేద మహిళకు చీరలు పంపిణీ చేశారు. ఇ కార్యక్రమం లో స్థానిక వైస్సార్సీపీ నాయుకురాలు రోజా, సన్నీ, నాయుకులు కార్యకర్తలు తదితరులు పాల్గున్నారు.