చెరువులను తలపిస్తున్న జగనన్న పేదలందరికి ఇళ్ల స్థలాలు.
పైడివాడ అగ్రహారం:
పైడివాడ అగ్రహారం గ్రామ పంచాయితీ లో ఏప్రిల్ 28 వ తారీఖున రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి చేతుల మీద ప్రారంభించిన నవరత్నాలు పేదలందరికీ ఇల్లు పథకం, చిన్నచిన్న వరద లకే రోడ్లు మొత్తం కోతకు గురయ్యాయి. దీనికి కారణం కొండ వాగు నుంచి వచ్చే వర్షపు నీరు మరియు చెరువుల నుంచి వచ్చే గడ్డ నీరు కు సరైన మార్గం రెవెన్యూ డిపార్ట్మెంట్ వారు చూపించక పోవడం వలన ఈ పరిస్థితి వచ్చింది. మరి అతి తక్కువ వర్షానికే ఈ రోడ్ల పరిస్థితి ఇలా ఉంటే రాబోయే వర్షాకాలంలో ఎలా ఉంటుందో ఊహించ వచ్చు, పైడివాడ అగ్రహారం గ్రామంలో నాలుగు చెరువులు ఉన్నవి ఈ నాలుగు చెరువులు వర్షపు నీరు ల్యాండ్ పూలింగ్ చేసిన సర్వే నెంబర్లు 128,126, కలిసి రాయిపూర్ రాజు చెరువు కి వెళ్తుంది, ఈ వర్షపు నీరు పోవడానికి సరైన ప్రణాళిక లేకుండా ఏదో తూతూమంత్రంగా రెవెన్యూ, వుడా వారు వ్యవహరించడం వలన ఈ రోడ్లకు వెచ్చించిన కోట్ల రూపాయల ప్రజాధనం వృధా అవుతుంది. నీరు పోవడానికి లేఅవుట్ లో ఎక్కడ సరేనా నా మార్గం చూపించలేదు. ఈ సర్వేనెంబర్ లో ఉన్న పాత గడ్డలను పూడ్చి వేశారు. దీనివల్లనే లేఔట్ మొత్తం కోతకు గురవుతోంది. ల్యాండ్ పోలింగ్ ద్వారా భూములు సేకరించిన రైతులకు డెవలప్మెంట్ చేసిన ప్లాట్లు ఇస్తామని చెబుతున్నారు. సీఎం ప్రోగ్రాం అయిపోయిన తర్వాత ఆ ప్లాట్ లో కనీసం ఒక తట్ట మట్టి తీయలేదు. ఏదో తూతూమంత్రంగా వేసిన ఫ్లాట్ లో మాత్రం నేల గిరి మొక్కలు పెరుగుతూ వస్తున్నాయి. దీనివలన పూర్వీకుల నుండి జీడి మామిడి తోటలు వేసుకుని వాటి ద్వారా వచ్చే ఫలసాయం ద్వారా రైతులు జీవనం సాగించేవారు. కానీ తొలగించిన ఫలసాయం కి కూడా ఎటువంటి నష్టపరిహారం ఇవ్వలేదు.కానీ ఈ భూములను ల్యాండ్ పోలింగ్ పేరుతో తీసుకోవడం వలన ఈరోజుకి రైతుకి ప్లాట్లు దక్కలేదు. అటు ఫలసాయం పోయి రైతులు లబోదిబో మంటున్నారు ఏమీ చేయలేని పరిస్థితిలో ఉన్నారు. ఈ ప్రభుత్వం పాలకులు చేస్తున్నా నిర్లక్ష్యానికి రైతులు బలైపోతున్నారు. అతి తక్కువ వర్షానికే గతంలో కూడా రోడ్లు కోతకు గురయ్యాయి పేపర్లో వచ్చిన కూడా ఎటువంటి చర్యలు కూడా చేపట్టలేదు. నవరత్నాలు పేదలందరికీ ఇల్లు పథకంలో కేటాయించిన లబ్ధిదారులు ఇచ్చిన ఒక సెంటు ఫ్లాట్ లో అయితే ఎక్కడ ఇచ్చినది పూర్తిగా తెలియకుండా రాళ్ళు కొట్టుకుపోవడం జరిగింది. అటు లబ్ధిదారులు భూమి ఇచ్చిన రైతులు నీరు పోవడానికి సరైన మార్గం చూపించమని మొదట నుంచి అధికారులను విన్నవించుకోవడం జరుగుతుంది. భారీ వర్షాలు కురిస్తే ఇక్కడి నిర్మాణాలు చేపట్టడానికి అవకాశం ఉంటుందా కాబట్టి ఇప్పటికైనా అధికారులు స్పందించి చెరువుల నుంచి వచ్చే నీరు పోవడానికి సరైన మార్గం చూపించవలసిందిగా వేడుకుంటున్నాము.

