నాగోతి సూర్య ప్రకాష్ ఆధ్వర్యంలో స్వర్గీయ నందమూరి తారకరామారావు శతజయంతి వేడుకలు.

 నాగోతి సూర్య ప్రకాష్ ఆధ్వర్యంలో స్వర్గీయ నందమూరి తారకరామారావు శతజయంతి వేడుకలు.

విశాఖ లోకల్ న్యూస్ :విశాఖపట్నం ప్రతినిధి

తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడైన నందమూరి తారకరామారావు శతజయంతి సందర్భంగా శనివారం జీవీఎంసీ జోన్ టు పరిధిలోని మధురవాడ ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య శాఖ  ఆసుపత్రి పరిసరాల్లో 7 వ వార్డు టీడీపీ సీనియర్ నాయకుడు నాగోతి సూర్య ప్రకాష్  ఆధ్వర్యంలో స్వర్గీయ నందమూరి తారక రామారావు  శతజయంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా 7వ వార్డ్ కార్పోరేటర్ పిళ్ళా మంగమ్మ మరియు వార్డ్ అధ్యక్షులు పిళ్ళా నరసింగరావు, పాల్గొని ముందుగా తెలుగుదేశం పార్టీ జెండా ఎగురవేసి ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.అనంతరం  కేక్ కటిగ్ చేసి వృద్ధులకు ఫలాలు, బ్రెడ్డు పంపిణీ చేస్తూ ఎన్టీఆర్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో పిళ్ళా వెంకటరావు, పోతిన. సోమ్ పాత్రుడు, వార్డ్ ప్రధాన కార్యదర్శి కనూరి. అచ్యుతరావు,మామిడి దుర్గారావు, కొల్లి చిరంజీవి,పోతిన. పొట్టి అప్పారావు,సురేష్, కుమార్ ,నోడగల. భవాని, వాంబే కొలని నాయకులు కొటేశ్వరవు, నాగేశ్వరరావు, మహిళలు  నాయకులు పార్టీ కార్యకర్తలు సీనియర్ కార్యకర్తలు మరియు చాలామంది నాయకులు కూడా ఇందులో పాల్గొనడం జరిగింది.