భారీగా పెంచిన బియ్యం పప్పులు వంట నూనె డీజిల్ పెట్రోలు వంట గ్యాస్ ధరలు తగ్గించాలని డిమాండ్.

 భారీగా పెంచిన బియ్యం పప్పులు వంట నూనె డీజిల్ పెట్రోలు వంట గ్యాస్ ధరలు తగ్గించాలని డిమాండ్.

విశాఖ లోకల్ న్యూస్ :విశాఖపట్నం ప్రతినిధి

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు భారీగా పెంచిన బియ్యం పప్పులు వంట నూనె డీజిల్ పెట్రోలు వంట గ్యాస్ ధరలు తగ్గించాలని రాష్ట్ర ప్రభుత్వం పెంచిన ఇంటి పన్ను చెత్త పన్న కరెంటు చార్జీలను రద్దు చేసి ప్రజలకు ఆహార భద్రత కల్పించాలని సిపిఎం  అక్కయ పాలెం జోన్ కార్యదర్శి సి ఆర్  రాజు సిపిఐ నాయకులు జి వామనమూర్తిప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ప్రభుత్వాలు భారీగా పెంచిన నిత్యవసర వస్తువులు డీజిల్ పెట్రోల్ వంట గ్యాస్ ప్రజలపై వేసేపన్నుల భారాలను రద్దు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూరాష్ట్ర వ్యాప్తంగా వామపక్ష పార్టీలు ప్రజా ఆందోళన చేపట్టాలని ఇచ్చిన పిలుపులో భాగంగా శనివారం ఉదయం పది గంటలకి తాటి చెట్ల పాలెం హైవే జంక్షన్ పెట్రోల్ బంక్ వద్ద సిపిఎం సిపిఐ ఆధ్వర్యంలో నిరసన ధర్నా జరిగింది ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సిపిఎం అక్కయ్యపాలెం జోన్ కార్యదర్శి ఆర్ పి రాజు సిపిఐ నాయకులు జి వామన మూర్తి మాట్లాడుతూ బిజెపి వైసిపి ప్రభుత్వాలు పోటీపడి పెంచుతున్న నిత్యవసర వస్తువుల ధరలు డీజిల్ పెట్రోల్ కరెంటు చార్జీలు ఇంటి పన్ను చెత్త పన్ను ఆయిల్ ధరల మీద వేసిన వ్యాట్ ఎక్సైజ్ డ్యూటీ పనులురద్దు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు లేనిపక్షంలో ప్రజాగ్రహానికి ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించక తప్పదు హెచ్చరించారు ఎమ్మెల్యేలు మంత్రులు ఎంపీలు చట్టసభల్లో పెరిగిన ధరల నియంత్రణకు ఎందుకు చర్చించడం లేదు ప్రజలకు చెప్పాలని ప్రశ్నించారు ప్రజల ఓట్లతో ఎన్నికైనప్రజా ప్రతినిధులు ప్రజా సమస్యలను గాలికి వదిలి సొంత వ్యాపారాలు వ్యాపకాలు చూసుకుంటున్నా ప్రజా ప్రతినిధులను ప్రజలు వీధిలో నిలదీయాలని పిలుపునిచ్చారు గడపగడపకు వైసిపి ప్రచారానికి వచ్చిన నాయకులను భారీగా పెంచినధరల నియంత్రణకు మీరు తీసుకున్న చర్యలు ఏంటో చెప్పాలని ప్రశ్నించండి నిలదీయండి పెంచిన ధరలు తగ్గించాలని ఎర్రజెండాలు జరుగుతున్న పోరాటాలు ఉద్యమాలను ప్రజలు బలపరచండి మహాధర్నాకు తరలిరండి విశాఖ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు మే 30 సోమవారం ఉదయం తొమ్మిది గంటల కి  వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో జరిగే మహాధర్నాలో ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రభుత్వానికి కళ్ళు తెరిపించాలని కోరారుప్రధాని  నరేంద్ర మోడీ జగన్ మోహన్ రెడ్డి లు ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను గాలికి వదిలి బడా కార్పొరేట్ సంస్థలకు లక్షల కోట్ల రూపాయలు రాయితీలు కల్పిస్తూ పేద ప్రజల పై ఆర్థిక భారాల వేస్తున్నారని మండిపడ్డారు ప్రభుత్వాలు పెంచిన ధరల కువ్యతిరేకంగా ఎర్రజెండాలు జరుపుతున్న ప్రజా పోరాటాలు లో ప్రజలు పాల్గొని ప్రభుత్వానికి కళ్ళు తెరిపించాలని ప్రజలకు పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో సిపిఐ సిపిఎం నాయకులు కె ఎస్ కుమార్ ఆర్ ఎన్ మాధవి లీలావతి బి సత్యం రవి కృష్ణ విశ్రీను రమణ జి సత్యనారాయణ కె అప్పలరాజు జై గణేష్ కుమార్ భీంపల్లి రాము శంకర్ వెంకటస్వామి పి.కె గోవిందు తదితరులు పాల్గొన్నారు ఇట్లు ఆర్ పి రాజు జి వామనమూర్తి.