మహానాడు కార్యక్రమానికి మధురవాడ నుండి భారీగా తరలి వెళ్లిన టీడీపీ నేతలు.

 మహానాడు కార్యక్రమానికి మధురవాడ నుండి భారీగా తరలి వెళ్లిన టీడీపీ నేతలు.

మధురవాడ విశాఖ లోకల్!

ఒంగోలులో జరుగుతున్న మహానాడు కార్యక్రమానికి మధురవాడ నుండి కార్యకర్తలు నియోజకవర్గం ఇంచార్జి కోరాడ రాజబాబు ఆధ్వర్యంలో బస్సులో బయలుదేరారు. రాజబాబు  జెండా ఊపి మహానాడు యాత్రను విజయవంతం చేయాలని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆనంద బాబు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మహానాడు నిర్వహణకు ఎన్నో ఆటంకాలు కలుగజేస్తుందని కేవలం ప్రతిపక్ష పార్టీ మీద కక్ష పూరితమైన చర్యలు చేపట్టడం దురదృష్టకరమని అన్నారు. మహానాడుకు సంబంధించి ఒంగోలులో ఎన్నో ఆంక్షలు పెట్టి టీడీపీ కార్యకర్తలను ఇబ్బంది పెట్టే విధంగా ప్రయత్నాలు చేయడం రాష్ట్ర ప్రభుత్వానికి మంచిది కాదని హితవు పలికారు. ప్రతిపక్ష పార్టీలు ఉంటేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని వాటిని మట్టుపెట్టాలని చూస్తే రానున్న ఎన్నికల్లో అధికార పార్టీకి ప్రజలే తగిన బుద్ధి చెబుతారని అన్నారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం లో ఎన్టీ రామారావు ఎన్నికల్లో సాధించిన ఫలితాలు మళ్లీ పునరావృతం అవుతాయి అని దీనికి కార్యకర్తలందరూ ఉత్సాహంగా మహానాడులో పాల్గొన్న విశేషమన్నారు. ఈ సందర్భంగా గంట నూకరాజు, దాసరి శ్రీనివాస్, నాగోతి సత్యనారాయణ,పిళ్ళా వెంకటరావు, మొల్లి లక్ష్మణరావు ,బోయి శ్రీను,పోతిన నాయుడు,బోయి రమాదేవి, నోడగల భవాని, సిరిపురపు సంతోషి, 5 6 7 8 వార్డుల కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.