ఫ్రెండ్స్ వనిత వాకర్స్ ఆధ్వర్యంలో నెల రోజుల పాటు ఘనంగా చలివేంద్రం.
విశాఖ లోకల్ న్యూస్ :విశాఖపట్నం ప్రతినిధి
నెల రోజుల పాటు వనిత వాకర్స్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన మజ్జిగ చలివేంద్రాన్ని నేటితో ముగించారు. మహా విశాఖ 6 వార్డు పరిధి పీఎం పాలెం తులసి నగర్ పార్క్ వద్ద ఫ్రెండ్స్ వనిత వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో మే 1 నుండి నెల రోజుల పాటు ఏర్పాటుచేసిన మజ్జిగ చలివేంద్రాన్ని మంగళవారం ముగించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మే నెలలో ఎండల తీవ్రత ఎక్కువగా ఉండడంతో నెల రోజుల పాటు చలివేంద్రం ఏర్పాటు చేశామని అన్నారు. ప్రతిరోజు పాదచారులకు వాహనదారులకు చల్లని మజ్జిగ పంపిణీ చేయడంపై స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షురాలు పుష్పలత, కార్యదర్శి ప్రసన్నకుమారి, కోశాధికారి భ్రమరాంబ ఇతర సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

