డాక్టర్ మారుతి హరీష్ కుమార్ కు ఎన్టీఆర్ జాతీయ సేవరత్న పురస్కారం.

 డాక్టర్ మారుతి హరీష్ కుమార్ కు ఎన్టీఆర్ జాతీయ సేవరత్న పురస్కారం.


 తెలంగాణ రాష్ట్రం  హైదరాబాదు సుందరయ్య విజ్ఞాన కేంద్రం  నందు జరిగిన
చినుకు & లిటిల్ ఛామ్స్ అకాడమీ ఆఫ్ ఇండియా ,వారు నిర్వహించిన స్వర్గీయ నందమూరి తారకరామారావు జయంతి సందర్భంగా  సమాజంలో  వివిధ  రంగాల్లో  వారి వృత్తి విశిష్ట ప్రావీణ్యం కలిగి సమాజంలో  సేవ చేస్తున్న సమాజ సేవకులను గుర్తించి వారి సేవలను కొనియాడుతూ జాతీయ సేవ పురస్కారలు అందచేసారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్, విశాఖపట్నం జిల్లా, కంచర పాలెం, ఇందిరానగర్-3 గ్రామానికి చెందిన డాక్టర్ . మారుతి హరీష్ కుమార్ కు సమాజంలో  చేస్తున్న సేవలను గుర్తించి వారికి ఎన్టీఆర్ జాతీయ సేవరత్న  పురస్కారంను ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిలుగావిచ్చేసిన సినీ టీవీ నటి స్వప్న,   కొలకలూరి పౌండేషన్  అధ్యక్షులు  కె.రవి బాబు, తెలంగాణహైకోర్టు సుపరడెంట్ .వి.పి. అంజనీకుమారి , లిటిల్ ఛామ్స్ అకాడమీ  సేకరిట్రీ  కె.బుచ్చేశ్వర్, చినుకు కల్చర్ సొసైటీ అధ్యక్షులు పి.ఎస్.మూర్తి
మరియు పలువురు ప్రముఖుల చేతులమీదుగా ఈ పురస్కారం అందుకున్నారు.

ఈ సందర్భంగా డాక్టర్ మారుతి హరీష్ కుమార్  మాట్లాడుతూ, 
 ఎన్టీఆర్ మహానుభావుడు తెలుగు  ఆంధ్ర రాష్ట్రం యొక్క గొప్పతనాన్ని దేశమంతటా చాటిచెప్పిన వ్యక్తి తెలుగు జాతి ముద్దుబిడ్డ అయినటువంటి 
ఎన్టీ రామారావు జయంతి సందర్భంగా      
 ఎన్ టి ఆర్ జాతీయ సేవరత్న పురస్కారం ప్రముఖుల చేతులమీదుగా అందుకోవడం నాకు  చాలా ఆనందదాయకంగా ఉంది నన్ను గుర్తించి ఈ అవార్డ్ కు ఎంపిక చేసిన ఈ కార్యక్రమ నిర్వహికులకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.