నేపాల్ లో విమానం మిస్సింగ్.. అందులో నలుగురు భారతీయులు.
న్యూఢిల్లీ: నేపాల్‌లో ఓ విమానం అదృశ్యమైన ఘటన కలకలం సృష్టించింది. ఆదివారం ఉదయం తారా ఎయిర్‌కు చెందిన 9 NAET ట్విన్ ఇంజిన్ విమానం ఆచూకీ గల్లంతైంది. కాగా, ఈ విమానం పోఖారా నుంచి నేపాల్‌లోని జోమ్‌సోమ్‌కు వెళ్తుండగా ఉదయం 9.55 గంటలకు ఏటీసీ నుంచి సంబంధాలు తెగిపోయాయని అధికారులు ధృవీకరించారు. మరోవైపు.. జోమ్‌సోమ్‌లోని సమీపంలో ఉన్న దౌలత్‌గిరి పర్వతం వైపు విమానం మళ్లిన తర్వాతే ఏటీసీతో సంబంధాలు తెగిపోయినట్టు తెలుస్తోంది.

