మున్సిపల్ కార్మికుల అలవెన్సులు తగ్గిస్తే పోరాటమే.సీఐటీయూ.

 మున్సిపల్ కార్మికుల అలవెన్సులు తగ్గిస్తే పోరాటమే.సీఐటీయూ.

విశాఖ లోకల్ న్యూస్ :విశాఖపట్నం ప్రతినిధి

ఎవరైనా వున్న వేతనాలు,జీతాలు పెంచుతారు.కానీ వైసీపీ ప్రభుత్వం మాత్రం వున్న అలవెన్సులు 6వేలు తగ్గించి,3వేలు వేతనాలతో కలిపి 18వెల రూపాయలు ఇస్తామని చెప్పడం ధగాకోరు నిర్ణయం అని సీఐటీయూ మధురవాడ జోన్ కమిటీ విమర్శించింది.
 అలవెన్సులు బకాయిలు వెంటనే ఇవ్వాలని,అలవెన్సులు కోత పెట్టే నిర్ణయం వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ జీ వి ఎం సి జోనల్ 2 కార్యాలయం అంబేద్కర్ విగ్రహం వద్ద శనివారం మున్సిపల్ కార్మికుల ధర్నా నిర్వహించారు. తీవ్ర ఎండ ను సైతం లెక్క చేయకుండా కార్మికులు  పాల్గొన్నారు. సందర్భంగా ఈ ధర్నా లో పాల్గొన్న సీఐటీయూ నాయకులు మాట్లాడుతూ  
మున్సిపల్ కార్మికులు ఇప్పటికే తీవ్రమైన పని వొత్తిడి ఎదుర్కొంటున్నారని అన్నారు.మన ముఖ్య మంత్రి జగన్ మోహన్ రెడ్డి కార్మికులకు ఇచ్చిన హామీని నెరవేర్చ కుండా అన్యాయం చేస్తున్నారని అన్నారు.పెరుగుతున్న ధరలు ఆకాశాన్ని అంటే విధంగా విధానాలు వున్నాయని అన్నారు.ఇటువంటి పరిస్థితిలో  కార్మికుల వేతనాలు పెంచాలని డిమాండ్ చేశారు.కనీస వేతనం 26 వేల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ క్రిందటి నెల 28,29 రెండు రోజులు జాతీయ సార్వత్రిక సమ్మె చేశారని తెలియజేశారు.
జీతాలు పెంచుతారని ఆశించిన కార్మికులకు పెంచకుండా వున్న అలవెన్సులు 3 వేలు కోత పెట్టడానికి కుట్రలు పన్నుతున్నారని తెలియజేశారు.ఇప్పటికే 412మంది కార్మికులను ఆప్కాస్ లో చేర్చకుండా
 అన్యాయం చేసి 23 నెలలు, నెలకు రూ 6 వేల రూపాయలు,మిగిలిన కార్మికులకు 9 నెలలకు అలవెన్సులు బకాయిలు చెళ్ళంచలేదని వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు.
ఆర్మికులకు ప్రతినెలా అలవెన్సు తో కలిపి 21 వేలు వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు.కనిసవేతనం 26 వేలు వేతనం పెంచాలని కోరారు.అదనంగా కార్మికులపై పని భారం పెంచకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.మున్సిపల్ కార్మికుల పెండింగ్ లో ఉన్న సమస్యలు పరిష్కారం చేయాలని డిమాండ్ చేశారు.అలవెన్సులు కోత చర్యలు మానుకోకుంటే పోరాటం ఉదృతం చేస్తామని అన్నారు.ఈ కార్యక్రమంలో సీఐటీయూ జోన్ అధ్యక్ష కార్యదర్శులు డీ అప్పలరాజు, పి రాజు కుమార్, యూనియన్ నాయకులు జీ కిరణ్, కే రాజు,శేషుబాబు, కే ఈశ్వరరావు, ఏ విజయకుమార్,కమలమ్మ, కే  కొండమ్మ , వి సంధ్య తదితరులు పాల్గొన్నారు.